సితార లో రవితేజ సినిమా.. వచ్చే సంక్రాంతికి రిలీజ్!

మాస్ మహారాజ రవితేజ 75వ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయబోతున్నాడు. సితార సంస్థతో పాటు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకున్న ఈ సినిమాని అనౌన్స్ చేసింది టీమ్. ‘అందరికీ హ్యాపీ ఉగాది రా భయ్‘.. వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపొండ్రి‘ అంటూ విడుదల తేదీపైనా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

భాను భోగారపు దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ఆద్యంతం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా డిటెయిల్స్ ను తెలియజేయనున్నారట.

Related Posts