అప్పుడు దేవిశ్రీ తో.. ఇప్పుడు తమన్ తో..

కొంతమంది డైరెక్టర్స్ కు కొంతమంది టెక్నిషియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. వాళ్లతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటారు. ఈ లిస్టులో మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తొలుత తన సినిమాలకు దేవిశ్రీప్రసాద్ నే ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకునేవాడు. బోయపాటి తొలి సినిమా ‘భద్ర‘.. ఆ తర్వాతి చిత్రం ‘తులసి‘లకు దేవిశ్రీనే మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మధ్యలో ‘సింహా, దమ్ము‘ చిత్రాలకు చక్రి, కీరవాణి లతో పనిచేసిన బోయపాటి.. మళ్లీ ‘లెజెండ్‘ కోసం దేవిశ్రీప్రసాద్ ను రంగంలోకి దింపాడు.

‘లెజెండ్’ మూవీ ఆడియో వేడుకలో దర్శకుడు బోయపాటి శ్రీను.. ఆ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్‌ ను ఉద్దేశించి.. ‘నేను దేవిశ్రీను ఈ సినిమా కోసం పడుకోనివ్వలేదు. మ్యూజిక్ చేసిన అన్ని రోజులు నేను ఆయనతో ఉన్నాను’ అంటూ వేదికపై స్పీచ్ ఇస్తుండగా.. వెంటనే దేవి మైక్ తీసుకొని దానికి రివర్స్ పంచ్‌లు వేసేశాడు. బోయపాటి నన్ను పడుకోనివ్వడం ఏంటి? సరైన మ్యూజిక్ ఇచ్చేంతవరకూ నేనే పడుకోను, నా పని నేను చేసుకున్నా.. బోయపాటి ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది చాలా తక్కువ. అదికూడా ల్యాప్ టాప్ చూస్తూ కుర్చున్నాడు అంటూ స్టేజ్‌పైనే దిమ్మతిరిగే పంచ్ వేసేశాడు. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

ఇండస్ట్రీలో శాశ్వత శతృవులు అంటూ ఎవరూ ఉండరు. ‘లెజెండ్‘ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ తర్వాత మళ్లీ బోయపాటి – దేవిశ్రీ కాంబోలో ‘జయ జానకి నాయక, వినయ విధేయ రామ‘ వంటి సినిమాలొచ్చాయి. ఇక.. దేవిశ్రీప్రసాద్ తో పాటు బోయపాటి ఎక్కువ సినిమాలు చేసిన మరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

‘సరైనోడు‘తో మొదలైన బోయపాటి-తమన్ కాంబోలో ‘అఖండ, స్కంద‘ సినిమాలొచ్చాయి. అయితే.. అప్పట్లో దేవిశ్రీ విషయంలో జరిగిన విషయమే ఇప్పుడు తమన్ కు కూడా రిపీట్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతటికీ కారణం లేటెస్ట్ గా బోయపాటి ఇచ్చిన ఓ ఇంటర్యూ. ‘అఖండ‘ విజయంలో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందనే ప్రశంసలు వచ్చాయి.

కానీ.. లేటెస్ట్ ఇంటర్యూ లో బోయపాటి తమన్ నేపథ్య సంగీతాన్ని తీసేసి చూసినా కూడా ‘అఖండ’ ప్రేక్షకులకు అంతే ఎగ్జైట్మెంట్ కలిగించేదని కామెంట్స్ చేశాడు. అయితే.. ‘అఖండ‘ అంత అద్భుతమైన సినిమా కాబట్టే ఎంతో ఇన్‌స్పైర్ అయి తమన్ నేపథ్య సంగీతం చేశాడని.. ఈ విషయంలో తన క్రెడిట్ తనకు ఇవ్వాల్సిందే అని బోయపాటి వ్యాఖ్యానించాడు.

‘అఖండ’ విషయంలో తమన్‌ వర్క్ ను కొనియాడిన వాళ్లే.. ఇప్పుడు ‘స్కంద’ విషయంలో విమర్శిస్తున్నారని.. అది కూడా తన దృష్టికి వచ్చిందని.. ఐతే తాము సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదని చెప్పాడు బోయపాటి.

తనపై బోయపాటి ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటల్లోనే తమన్ కూడా సోషల్ మీడియా వేదికగా ‘ఐ డోంట్ కేర్‘ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. తమన్ పెట్టిన ఈ పోస్ట్ బోయపాటి గురించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Posts