రజినీకాంత్ తో లోకేష్ ..

కాంబినేషన్సే ఇప్పుడు క్రేజ్ ను పెంచుతున్నాయి. ముఖ్యంగా కొందరు దర్శకుల పేర్లు వింటే చాలు.. వాళ్లు ఏ హీరోతో చేస్తున్నారో తెలియగానే ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం అంతటి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో లోకేష్ కనకరాజ్ ఒకడు. చాలా స్లోగా మొదలైన అతని ప్రయాణం సంచలనంగా సాగుతోంది. ఒకప్పుడు సందీప్ కిషన్ తో మా నగరం అనే సినిమాతో దర్శకుడుగా మారాడు. తెలుగులో ఆకట్టుకోలేదు కానీ తమిళ్ లో ఈ మూవీ హిట్. ఆ తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఇలా బ్లాక్ బస్టర్స్ తో సాగుతోంది అతని ప్రయాణం. మాస్టర్ తర్వాత మరోసారి విజయ్ తో లియో అనే సినిమా చేశాడు. ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మూవీ తర్వాత అతను ఖైదీ2 చేస్తాడు అనే భావించారు. బట్ అతని రూట్ మారిందంటున్నారు. లేదా ఖైదీ తర్వాత సూపర్ స్టార్ తో గ్యారెంటీ అంటున్నారు.

లోకేష్ కనకరాజ్ తర్వాతి ప్రాజెక్ట్ రజినీకాంత్ తో ఉంటుందనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే ఇది నిజమే అని లేటెస్ట్ గా వచ్చిన వార్తలు చూస్తే అర్థం అవుతుంది. రజినీకాంత్ జైలర్ తో తిరుగులేని బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నాడు.

ప్రస్తుతం రజినీకాంత్ జై భీమ్ ఫేమ్ టిజే జ్ఞానవేల్ రాజాతో సినిమా చేస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నాడు. అలాగే తన కూతురు Soసౌందర్య దర్శకత్వంలో లాల్ సలామ్ అనే సినిమా కూడా పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ తో సినిమా అనే వార్త ఈ రెండు సినిమాలనూ సైడ్ చేస్తుందనడంలో ఆశ్చర్యమేం లేదు.

ఇక ఈ చిత్రానికి జైలర్ నిర్మాత కళానిధి మారనే నిర్మాత అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసమే ఆయన ఆ మధ్య కాస్ట్ లీ కార్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో పాటు భారీ అడ్వాన్స్ కూడా చెల్లించాడు అనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు ఈ కాంబినేషన్ లో ‘తలైవర్171’ అనే ఓ పోస్టర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. బట్ ఈ నెంబర్ తో జ్ఞానవేల్ రాజా సినిమా ఉంది. సో.. ఒకవేళ లోకేష్ , రజినీకాంత్ సినిమా ఉన్నా.. 2025లోనే వస్తుందనుకోవచ్చు. లేదూ.. రజినీ ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ను హోల్డ్ లో పెట్టి ఓకే చేస్తే తప్ప ఇది నెక్ట్స్ ఇయర్ కు సాధ్యం కాదు.


లోకేష్ వరుస ఫ్లాపుల్లో కమల్ హాసన్ కు విక్రమ్ రూపంలో కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చి ఉన్నాడు. మరి జైలర్ తో రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ తో మూవీ అంటే ఆ రికార్డులు బద్ధలయ్యే కంటెంట్ నే ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను అతను రీచ్ అయితే ఇంక కోలీవుడ్ రికార్డులన్నీ మాయమైపోతాయి.

Related Posts