బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన పుష్పరాజ్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్ తో 2021లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు వీళ్లు. ఈ చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది. ఒక తెలుగు నటుడుకి ఉత్తమ నటుడుగా అవార్డ్ రావడం ఇన్నేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే ఆ మూమెంట్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ అవార్డ్ అనౌన్స్ మెంట్ కు ముందే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కాకపోతే ఊహించినదానికంటే బాగా ఆలస్యంగా మొదలైంది. దీంతో చాలామంది ఈ మూవీ ఈ యేడాది డిసెంబర్ లో విడుదలవుతుందనుకున్న ఈ మూవీ రాకపోవచ్చు అనే అంచనా వేశారు. అయితే మార్చి 22న విడుదలవుతుందనేవార్తలు కొన్నాళ్ల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

రిలీజ్ డేట్ విషయంలో బిగ్ సర్ ప్రైజ్ ఇస్తూ కొత్త అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది పుష్ప 2 మూవీ టీమ్.2024 ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి పుష్ప2 సమ్మర్ లోనే విడుదలవుతుందని చాలామంది భావించారు. మహా అయితే రిలీజ్ డేట్ లో ఒకటి రెండు వారాలు మార్పు ఉంటుందనుకున్నారు. బట్ వీళ్లు ఏకంగా సీజన్ నే దాటి వెళ్లిపోయారు.

వచ్చే యేడాది ఇండిపెండెన్స్ డే స్పెషల్ గావిడుదల చేయడం అంటే ఇక ఐకన్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడప్పుడే ఈ మూవీ అప్డేట్స్ ను ఎక్స్ పెక్ట్ చేయడం మానేస్తే బెటర్. రిలీజ్ కు చాలా టైమ్ ఉంది కాబట్టి.. సంక్రాంతి, ఉగాది టైమ్ లో మాత్రం ఏదైనా అప్డేట్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మరీ అంత దూరం ఎందుకు వెళ్లారు అనేదే పెద్ద ప్రశ్న.

అయితే ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ అవుట్ పుట్ పై అంత సంతృప్తికరంగా లేదట టీమ్. అందుకే మరోసారి కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయబోతున్నారు. అదీకాక వర్షాలు బాగా కురుస్తున్నాయి. దీంతో మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ కూడా సమస్య అవుతుంది. మరో రెండు నెలల వరకూ అక్కడ అనుకూలంగా ఉండదు. అందుకే ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు అనుకోవచ్చు.
మరోవైపు నేషనల్ అవార్డ్ తర్వాత అంచనాలు పెరుగుతాయి కాబట్టి.. కంటెంట్ లో కూడా కాస్త మార్పులు చేస్తున్నారంటున్నారు. ఏదేమైనా పుష్ప 2 2024 ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది.

Related Posts