HomeMoviesటాలీవుడ్థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోన్న 'టెనెంట్' రిలీజ్ ట్రైలర్

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోన్న ‘టెనెంట్’ రిలీజ్ ట్రైలర్

-

‘పొలిమేర2’ సూపర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈమూవీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసింది టీమ్.

ఈ సినిమాలో ప్రధానంగా నాలుగైదు పాత్రలున్నాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ‘టెనెట్’ రూపొందినట్టు రిలీజ్ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఒకమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే పాత్రలో సత్యం రాజేష్ కనిపిస్తున్నాడు. కొన్ని కారణాల వలన అతను భార్యను హత్య చేయడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? అనేది ట్రైలర్ లో చూపించారు. అయితే.. ప్రజెంట్ జనరేషన్ లో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడట డైరెక్టర్ వై.యుగంధర్.

సత్యం రాజేష్ , మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ , తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తెర్ నొరోన్హ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలకు ముస్తాబవుతుంది.

ఇవీ చదవండి

English News