‘భలే ఉన్నాడే!’ సాంగ్.. వైవిధ్యంగా ఆకట్టుకుంటోన్న రాజ్ తరుణ్

పక్కింటబ్బాయి తరహా పాత్రల్లో ఒదిగిపోవడంలో ముందుంటాడు రాజ్ తరుణ్. ఇప్పుడు అలాంటి తరహా పాత్రనే ‘భలే ఉన్నాడే!’ సినిమాలో చేస్తున్నాడు. చీరలు బిజినెస్ చేసే కుర్రాడిగా ఈ మూవీలో ఆకట్టుకోనున్నాడు రాజ్ తరుణ్. చెవికి రింగులు పెట్టుకుని ఆడోళ్లతో చీరల బేరం చేసే పాత్రలో రాజ్ తరుణ్ అలరించబోతున్నట్టు ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది.

తాజాగా.. ‘భలే ఉన్నాడే!’ మూవీ నుంచి ‘ఆడోళ్లకు ఆమడ దూరం.. చేసేది చీరల బేరం.. తెల్లారితే సూదీ దారం.. యవ్వారం యమునా తీరం..’ అంటూ సాగే గీతం విడుదలైంది. శేఖర్ చంద్ర సంగీతంలో పుర్ణాచారి రాసిన ఈ గీతాన్ని ధనుంజయ్ సీపాన ఆలపించారు. ఈ పాటలో రాజ్ తరుణ్ తో పాటు హైపర్ ఆది కూడా ఆకట్టుకుంటున్నాడు. ఎన్.వి.కిరణ్ కుమార్ నిర్మాణంలో జె.శివసాయి వర్థన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Related Posts