తెలిసి తెలిసి అని పాడుతున్న ‘చౌర్యపాఠం’

కంప్లీట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న మూవీ చౌర్యపాఠం. ధమాకాతో బంపర్ హిట్ కొట్టిన నక్కిన త్రినాధరావు ఈ సినిమాతో నిర్మాతగా మారారు. నిఖిల్ గొల్లమూరి డైరెక్షన్‌లో రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ , టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఇదే జోష్‌లో చౌర్యపాఠం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
తెలిసి తెలిసి అంటూ సాగే పాట విడుదల చేసి మ్యూజికల్ జర్నీని ప్రారభించారు మేకర్స్. డేవ్ జాంద్ ఈ పాటని సోల్ ఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని మనసుని హత్తుకునే లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, హరిచరణ్ తమ అద్భుతమైన వోకల్స్ తో ఆకట్టుకున్నారు.

ఈ పాటలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ కెమిస్ట్రీ మెస్మరైజింగ్ గా వుంది. విజువల్స్ చాలా ప్లజెంట్ గా వున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలించేలా వున్న ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

Related Posts