ఆర్‌సి ట్రెండ్ సెట్టర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆకాశ్‌పూరి

ఆకాష్‌ పూరి చైల్డ్ ఆర్టిస్ట్‌ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సినిమాలు చేస్తూ తన సత్తా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కెరీర్‌లో హీరోగా మారిన తక్కువ టైమ్‌లోనే ఓ బ్రాండ్‌కు అంబాసిడర్ గా వ్యవహరించే స్థాయికి చేరాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఆర్‌సీ ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా స్టైలిష్‌ ఫోటో షూట్ చేసారు. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. త్వరలోనే ఆకాష్ పూరి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేయబోతున్నాడు.

Related Posts