ఆది పినిశెట్టి ‘శబ్దం‘ టీజర్ కి సూపర్ రెస్పాన్స్..!

ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటుడు ఆది పినిశెట్టి. ఈ విలక్షణ నటుడు ‘శబ్దం‘ సినిమాతో ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలి‘ వంటి హిట్ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషిస్తుండగా.. లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. 7జి శివ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజయ్యింది. హారర్ థ్రిల్లర్ గా అతీంద్రియ సంఘటనల ఇతవృత్తంతో విడుదల చేసిన టీజర్ కి తెలుగు, తమిళ భాషల్లో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా.. ఈ టీజర్ లో మ్యూజికల్ సెన్సేషన్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా భయపెడుతోంది.

Related Posts