తమన్నా, రాశీ ఖన్నా ‘బాక్‘ ప్రమోషనల్ సాంగ్

మిల్కీ బ్యూటీ తమన్నా, మెస్మరైజింగ్ బ్యూటీ రాశీ ఖన్నా కనువిందు చేయబోతున్న హారర్ థ్రిల్లర్ ‘బాక్‘. తమిళ దర్శకుడు, నటుడు సుందర్.సి పాపులర్ హారర్ సిరీస్ ‘అరణ్మనై‘లో వస్తోన్న నాల్గవ సినిమా ఇది. ఈ మూవీలో సుందర్.సి హీరోగానూ నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి వంటి కమెయడిన్స్ కూడా నటించారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని సమకూరుస్తున్న ‘బాక్‘ నుంచి ‘పంచుకో..‘ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్ రిలీజయ్యింది. సాహితీ రచనలో రాఘవి ఈ గీతాన్ని ఆలపించింది. తమన్నా, రాశీ ఖన్నా గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ పాట ఆకట్టుకుంటుంది.

Related Posts