కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో ‘జితేందర్ రెడ్డి‘ పాట

1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న పొలిటికల్ డ్రామా ‘జితేందర్ రెడ్డి‘. ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ ఫేమ్ విరించి వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రె లీడ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ‘హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్’.
ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘అ ఆ ఇ ఈ ఉ ఊ‘ అంటూ సాగే గీతం విడుదలైంది. కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ పాట ఆకట్టుకుంటుంది. గోపీ సుందర్ సంగీతంలో రాంబాబు గోసాల రాసిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు.

Related Posts