ఎన్టీఆర్ కోసం బలే ప్లాన్ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర కోసం అద్భుతమైన ప్లాన్ వేశాడు కొరటాల శివ. ఈ ప్లాన్ చూసిన వాళ్లంతా అరే ఇది బలే ఉందే.. అనుకుంటూనే నచ్చావయ్యా కొరటాలా అంటున్నారు. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో సాగే కథ అని ముందే చెప్పారు కదా.. అలాగని సముద్రంలో చిత్రీకరణ చేయలేరు. అంతా బ్లూ మ్యాట్ లోనే చిత్రీకరణ చేస్తున్నారు. అంటే తర్వాత దీన్ని విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో మిక్స్ చేసి అచ్చంగా సముద్రంలో యుద్ధాలు జరుగుతున్నాయా అనే కల్పన కలిగిస్తారు.

అయితే ఒక్కోసారి టైమ్ సరిపోక గ్రాఫిక్స్ సరిగా రాదు. దీంతో క్వాలిటీ మిస్ అవుతుంది. అందుకే కొరటాల ముందు ఆ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నాడు. యస్.. ముందు నుంచీ ఈ చిత్రానికి సంబంధించి అన్నీ ఫైట్స్ మాత్రమే ఎందుకు షూట్ చేస్తున్నారో చాలామందికి అర్థం కాలేదు. ఈ సీక్వెన్స్ లకే 80శాతం విఎఫ్ఎక్స్ అవసరం అవుతాయట. ముందు అవి తీసి పోస్ట్ ప్రొడక్షన్ కు ఇస్తే తర్వాత టాకీ పార్ట్ తో పాటు పాటలు కూడా షూటింగ్ చేసుకోవచ్చు. ఇదేమంత పెద్ద కష్టం కాదు. ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్ట్ ఉంటే టాకీ పార్ట్ కు టైమే పట్టదు. అందుకే ముందుగా బ్లూ/ గ్రీన్ మ్యాట్ ఎక్కువగా ఉన్న సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్నారు.


ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి నాలుగు భారీ ఫైట్లు షూటింగ్ చేశారు. ఇవన్నీ హైదరాబాద్ లోని శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే చిత్రీకరణ చేస్తున్నారు.


ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు. సంగీతం అనిరుధ్ అందిస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న విడుదల కాబోతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Related Posts