పవన్ కళ్యాణ్ ను వాళ్లు పట్టించుకుంటారా..

పవర్ స్టార పవన్ కళ్యాణ్.. తన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా సుదీర్ఘంగానే మాట్లాడాడు. అనేక అంశాలను టచ్ చేశాడు. సినిమా, సాహిత్యం, ఫ్యామిలీ, ఇండస్ట్రీ, ఇతర హీరోలు.. ఇలా చాలా విషయాలే చెప్పాడు. అయితే అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంది మాత్రం తమిళ్ సినిమా పరిశ్రమకు చేసిన విన్నపం.

ప్రస్తుతం సినిమాకు బౌండరీస్ లేవు. అందుకే ఏ టెక్నీషిన్ అయినా.. ఆర్టిస్ట్ అయినా వేరే భాషల్లో నటిస్తూ పనిచేస్తూ బిజీగా ఉంటున్నారు. కానీ తమిళ్ ఇండస్ట్రీ వాళ్లు మాత్రం కేవలం తమిళ్ వారికే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పద్ధతిని మార్చుకుని అందరికీ అవకాశాలివ్వాలని చెప్పాడు పవన్ కళ్యాణ్.ఈ మేరకు తమిళ్ పరిశ్రమకు విన్నపం చేస్తున్నా అని కూడా అన్నాడు.


తమిళ్ ఇండస్ట్రీకి చెందిన సముద్రఖని ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్నాడు. అలాగే మీరూ ఇతరులకు అవకాశాలివ్వాలి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు కోలీవుడ్ నుంచి కూడా రావాలి. అప్పుడు అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తారు అన్నాడు.సముద్రఖని తెలుగు నేర్చుకుని మరీ ఇక్కడ సినిమా చేశారనీ..ఆ పట్టుదల అందరిలోనూ ఉండాలన్నాడు.అలాగే నేను కూడా తమిళ్ నేర్చుకుని ఇకపై రాయడం కూడా ప్రాక్టీస్ చేస్తా అన్నాడు. మొత్తంగా తమిళ్ పరిశ్రమ కేవలం వారి వారికే అవకాశాలివ్వకుండా అందరినీ కలుపుకుపోవాలని చెప్పాడు.


మరి ఈ మాటలపై అక్కడి నుంచి ఎవరు రియాక్ట్ అవుతారో కానీ.. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను చాలామంది.. అతనేదో తమిళ్ వాళ్లకు క్లాసులు పీకాడని మనోళ్లు రాసుకుంటున్నారు. పవన్ కు తమిళపరిశ్రమకు క్లాస్ లు పీకేంత ఉందా అనేది మొదటి ప్రశ్న. ఎందుకంటే వాళ్లు వాళ్లకే అవకాశాలిచ్చుకోవడం తప్పెలా అవుతుందీ..

Related Posts