ఏజెంట్ బ్యూటీకి సూపర్ ఆఫర్

ఏజెంట్ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన బ్యూటీ సాక్షి వైద్య. ఏజెంట్ సినిమా అస్సలే మాత్రం ఆకట్టుకోలేదు. తన పాత్ర కూడా పెద్దగా రిజిస్టర్ కాలేదు. దీంతో అమ్మడి కెరీర్ మొదటి సినిమాకే ముగిసిపోయిందనుకున్నారు చాలామంది.

బట్ అది నిజం కాదు. తను ఇప్పుడు గాండీవధారి అర్జున సినిమాతో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో తను ఓ పవర్ ఫుల్ రోల్ చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దీంతో పాటు రవితేజ హీరోగా నటించబోతోన్న ఓ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయింది. వీటికి మించి తను ఓ బంపర్ ఆఫర్ పట్టేసింది.


పవన్ కళ్యాణ్‌ సరసన హీరోయిన్ గా సాక్షి వైద్యను తీసుకున్నట్టు టాక్. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. హరీష్‌ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఇప్పటికే శ్రీ లీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇది తమిళ్ సూపర్ హిట్ తెరికి రీమేక్. సో మరో హీరోయిన్ కు చాన్స్ ఉంది. ఆ చాన్స్ ను సాక్షి దక్కించుకున్నట్టు తనే చెప్పింది. ప్రస్తుతం గాండీవధారి ప్రమోషన్స్ లో ఉన్న సాక్షి ఈ ముక్క లీక్ చేసింది. అయితే తను ఇంకా ఆ మూవీ షూటింగ్ లో జాయిన్ కాలేదు అనే విషయం కూడా చెప్పింది.


ఇక ఈ మూవీలో సమంత పాత్రలో సాక్షి వైద్య కనిపించబోతోందని తాజా సమాచారం. శ్రీ లీలను ఎమీ జాక్సన్ రోల్ కోసం తీసుకున్నారట. కాకపోతే శ్రీ లీలకు ఉన్న క్రేజ్ ను బట్టి ఆ పాత్రనే ఎక్కువగా పెంచి.. సాక్షి పాత్ర సమంత అంత స్ట్రాంగ్ గా ఉండకుండా చేశారట. అంటే ఓ సాధారణ ఇల్లాలుగా తను కనిపిస్తుందేమో అనుకోవచ్చు. లేదా మరీ పెద్ద ట్రాక్ ఉండకపోవచ్చు.

ఎలాగూ ఈ పాత్ర సినిమాలో చనిపోతుంది. ఆ తర్వాతే శ్రీ లీల పాత్ర ఎంటర్ అవుతుంది. అంటే అప్పుడు తనే సెకండ్ హీరోయిన్ అవుతుంది. ఆ ఇబ్బంది లేకుండా తననే మెయిన్ హీరోయిన్ అనేలా స్క్రిప్ట్ లో మార్పులు చేసుకున్నాడట హరీష్‌ శంకర్. మరి ఈ మార్పులు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో కానీ.. అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న క్లారిటీ మాత్రం కనిపించడం లేదు.

Related Posts