భయపెడుతున్న కింగ్ ఆఫ్‌ కొత్తా నిడివి

ఇవాళా రేపు సినిమా బావుంటే మూడు గంటలైనా చూస్తున్నారు. అలాగని ఆ మూడు గంటలూ సూపర్బ్ గానే ఉండాలి. ఏ అరగంట ఇబ్బంది పెట్టినా మొత్తానికే మోసం వస్తుంది. సినిమా ల్యాగ్ ఉందంటారు. నత్తనడక స్క్రీన్ ప్లే అంటారు.. ఇంకా నచ్చినవి పక్కన పెట్టి నిడివి గురించి కమెంట్స్ చేస్తుంటారు.

స్లో నెరేషన్ అనే మాటకు పేటెంట్ రైట్స్ ఉన్న మళయాలం నుంచి ఓ సినిమా వస్తోందంటే.. మొదటి నలభై నిమిషాల పాటు మన సహనాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఆ తర్వాతే అసలు కథ మొదలుపెడతారు వాళ్లు. బట్ యాక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్స్ కు కూడా ఇదే తరహా ట్రీట్మెంట్ అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. మరి తెలుగులోనూ అలాగే ఉందో లేదో కానీ.. దుల్కర్ సాల్మన్ కొత్త సినిమా కింగ్ ఆఫ్‌ కొత్తా తెలుగులో ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈ మూవీ నిడివి చూస్తేనే ఇప్పుడు ఆడియన్స్ కాస్త ఆలోచిస్తున్నారు.


కింగ్ ఆఫ్ కొత్తా 170 నిమిషాలుంటుందట. అంటే 2 గంటల 56 నిమిషాలు. మూడు గంటల సినిమా. మాలీవుడ్ మూవీస్ స్లో నెరేషన్ కు పెట్టింది పేరు. మామూలుగా రెండు గంటల సినిమా చూస్తేనే మూడు గంటల ఫీలింగ్ ఇచ్చేవీ ఉన్నాయి.

అలాంటిది మూడు గంటలు అంటే ప్రేక్షకులు భరించగలరా అనేది ప్రశ్న. మరోవైపు తెలుగు వెర్షన్ కు ఏమైనా ఎడిటింగ్స్ ఉంటాయా అనేది కూడా తేలాల్సి ఉంది. ఏ ఇండస్ట్రీలో అయినా మంచి స్క్రీన్ ప్లే.. ఉంటే మూడు గంటలు మేటర్ కాదు. కానీ స్లో నెరేషన్ లో ఉంటే మూడు గంటలు అనేదే పెద్ద మైనస్ అవుతుంది.

Related Posts