ఏయ్.. సుధీర్ కూడా ఏసేశాడు

బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు సుధీర్. ముఖ్యంగా రష్మితో నడిపిన వ్యవహారమే అతన్ని ఎక్కువ ఫేమ్ లోకి తెచ్చింది. అతని టీమ్ లో అతనికంటే టాలెంటెడ్ వాళ్లు ఉన్నా.. పేరు మాత్రం సుధీర్ కే వచ్చింది.

అతని ప్రెజెన్స్ తో పాటు హార్డ్ వర్క్ కూడా అందుకు కారణం. మంచి టైమింగ్ తో పాటు మ్యాజిక్, డ్యాన్స్ అంటూ ఇతర విషయాలు కూడా తోడై తిరుగులేని ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది. ఏకంగా మనోడిని బుల్లితెర మెగాస్టార్ అనేసుకున్నారు జనం.

నిజానికి కూడా టివి షోస్ లో సుధీర్ ఉంటే వచ్చే రేటింగ్ వేరే అంటారు. ఆ ఫేమ్ ను వెండితెర వరకూ విస్తరించుకున్నాడు అతను. మొదట చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలు ఆకట్టుకోలేదు. కానీ తను సోలో హీరోగా నటించిన గాలోడు మాత్రం కమర్షియల్ గా మంచి ప్రాఫిటబుల్ అనిపించుకుంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే అతను కూడా మాస్ రాజా రేంజ్ లో కొత్త డైలాగ్ ఒకటి కొట్టాడు.


సుధీర్ కొత్త సినిమా గోట్(G.O.A.T) దీన్ని గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే ఫుల్ ఫామ్ లో అనుకోమంటున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వీడియో గ్లింప్స్ వచ్చింది. ఈ గ్లింప్ లో అతని ఎలివేషన్ ఓ రేంజ్ లో కనిపిస్తోంది. లుంగీ ఎగ్గట్టి క్రికెట్ బ్యాట్ చేత పట్టుకుని సిగరెట్ వెలిగింది.. ” ఎవడ్రా నన్ను ఫ్లూక్ అన్నది.. ” అని చెప్పిన డైలాగ్ చూసి ఏయ్ సుధీర్ కూడా మొదలుపెట్టాడు అనుకుంటున్నారు.

నిజానికి అది సినిమా డైలాగ్ అయినా.. అతని కెరీర్ పై వచ్చిన విమర్శలపైనా కౌంటర్ లా ఉన్నాయి. ఆ డైలాగ్ పడగానే వెనక బెంజ్ కార్లు వరుసగా వస్తండటం చూస్తే అది సిట్యుయేషనల్ డైలాగ్ లానే ఉంది. కాకపోతే ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అనే కమెంట్స్ కూడా ఉన్నాయి.


ఇక ఈ గ్లింప్స్ లో అన్నిటికంటే హైలెట్ గా ఉన్నది నేపథ్య సంగీతం. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం గ్లింప్స్ కే ఒక హై మూమెంట్ క్రియేట్ చేసింది. ఒక్కసారిగా జైలర్ ను గుర్తు చేశారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమాతో అతనిపై ఏకంగా 10 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశారట నిర్మాతలు.

మరి ఈ పది కోట్లు వెనక్కి తెచ్చే సత్తా అతనిలో ఉందా అనేకంటే.. తెస్తే గనక టైర్ త్రీ హీరోల లిస్ట్ లోకి ఇమ్మీడియొట్ గా వెళ్లిపోతాడు.ఈ సినిమాతో తన పేరును సుధీర్ ఆనంద్ గా కూడా మార్చుకున్నట్టున్నాడు. సుధీర్ సరసన దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. ముఠా రాజన్, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్నాడు.

Related Posts