సుహాస్ కొత్త సినిమా ‘ఓ భామ అయ్యో రామ‘

హీరోగా వరుస విజయాలందుకుంటోన్న సుహాస్ ‘ఓ భామ.. అయ్యో రామ‘ అనే కొత్త సినిమాని ప్రారంభించాడు. సుహాస్ కి జోడీగా మాళవిక మనోజ్ నటిస్తుంది. రామ్ గోదాల ఈ చిత్రానికి దర్శకుడు. విఆర్ట్స్, చిత్రలహరి టాకీస్ బ్యానర్స్ పై హ‌రీష్ న‌ల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు (మార్చి 30) ‘ఓ భామ.. అయ్యో రామ‘ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో జరిగాయి. హీరో, హీరోయిన్‌పై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. ద‌ర్శకుడు వ‌శిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మ‌రో దర్శకుడు శైలేష్ కొల‌ను బౌండెడ్ స్కిప్ట్‌ను దర్శకుడికి అంద‌జేశారు. టైటిల్ పోస్టర్ ను దర్శకులు విజయ్ క‌న‌క‌మేడ‌ల‌, కిషోర్ తిరుమ‌ల‌, నిర్మాత‌ సుదర్శన్ రెడ్డి, ఆవిష్కరించారు.

Related Posts