యాంకర్ తో సుడిగాలి సుధీర్ కాదు.. ఆది లవ్ స్టోరీ

జబర్దస్త్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అడల్ట్ జోకులే కాదు.. అందులోని ప్రేమకథలు కూడా అలాంటి ఫేక్ లవ్ స్టోరీతోనే ఫేమ్ అయ్యాడు సుడిగాలి సుధీర్, రష్మి. ఈ ఇద్దరి మధ్య నిజంగా లవ్ ఉందా లేదా అనేది తెలియదు కానీ.. చాలామంది ఇప్పటికీ ఉందనే నమ్ముతారు. బట్ అదంతా ప్రొఫెషనల్ లో భాగం అనే చెబుతారు ఇద్దరూ.

ఈ ముక్క చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అయినా ఇంకా ఆళ్లు లవ్ సేసుకుంతన్నారు అనే అనుకుంటారు కొందరు. అయితే యాంకర్స్ తో లవ్ స్టోరీస్ మామూలు అయిపోయిన తర్వాత కంటెంస్టెంట్స్ మధ్య ప్రేమకథలు నడుపుతూ షో కు రేటింగ్ తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు మేకర్స్. అయితే సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ చేయడం లేదు.అయినా అతనిపై ఆ రూమర్ అలాగే ఉండిపోయింది. అయితే తాజాగా సుధీర్ లవ్ స్టోరీలా హైలెట్ అవ్వలేదు కానీ ఆది కూడా ఓ యాంకర్ తో ప్రేమలోఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. త్వరలోనే వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారట.


జబర్దస్త్ కు రైటర్ గా ఎంటర్ అయి యాక్టర్ గా మారి టీమ్ లీడర్ కూడా అయ్యాడు ఆది. మధ్యలో వేరే ఆఫర్స్ చాలా వచ్చినా వెళ్లలేదు. ప్రస్తుతం జబర్దస్త్ లో హయ్యొస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. అతను కొంతకాలంగా ఓ యాంకర్(రష్మి కాదు)తో ప్రేమలో ఉన్నాడట. వీరి మధ్య కూడా కొన్ని కామెడీ షోస్ లో ట్రాక్స్ నడిచాయి అని సమాచారం.

కానీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నారట. మామూలుగా చిన్న గాసిప్ వస్తేనే పెద్ద వార్తలు అవుతున్న రోజుల్లో వీరు మాత్రం సుధీర్, రష్మీల ట్రాక్ వెనక దాక్కుండిపోయారు అంటున్నారు. మొత్తంగా వీరి పెళ్లికి రెండు ఫ్యామిలీస్ నుంచి అంగీకారం రాగానే ఆ యాంకర్ తో కలిసి తమ ప్రేమ, పెళ్లి వ్యవహారాన్ని పబ్లిక్ కు చెప్పడానికి రెడీ అవుతున్నారట. ఆది పంచ్ లే కాదు.. లవ్ స్టోరీ కూడా బానే రాసుకున్నాడన్నమాట.

Related Posts