నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతున్న సినిమా

థియేటర్స్ లో హిట్ అయిన సినిమాలు ఓటిటిలో డల్ అవుతుండటం రెగ్యులర్ గాచూస్తున్నాం. అలాగే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటిటిల్లో బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ మాత్రం రెండు చోట్లా హిట్ అనిపించుకునే సినిమాలు పడుతుంటాయి.

అలాంటిదే నాయకుడు. వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో నటించిన మామన్నన్ అనే తమిళ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో ఉందీ సినిమా. రాజకీయాల్లోనూ సామాజిక అసమానతల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో నాయకుడు పేరుతో డబ్ అయింది. బట్ మనవాళ్లెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం నెంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతోంది.


కెరీర్ మొత్తం కమెడియన్ గానే ఆకట్టుకున్న వడివేలు ఫస్ట్ టైమ్ సీరియస్ రోల్ లో నటించిన సినిమా ఇది. ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవరినీ ఊహించుకోలేం అన్నంత అద్భుతంగా నటించాడు. చక్రవర్తి అనే దళిత ఎమ్మెల్యే పాత్ర అది. ఆయన పార్టీకి చెందిన అగ్రకులం వ్యక్తి పార్టీకి అధ్యక్షుడుగా ఉంటూ ఈయన్ని కనీసం కుర్చీలో కూడా కూర్చోనివ్వడు.

ఆ సందర్భం తెలిసిన చక్రవర్తి కొడుకు ఆ వ్యక్తిని ఎదురిస్తాడు. దీంతో వ్యవహారం పార్టీ అధిష్టానం వద్దకు వెళుతుంది. ఇలాంటి విషయాలను వ్యక్తిగతంగా కాక రాజకీయంగానే ఎదుర్కోవాలి అంటూ పెద్దలు చెప్పిన మాటను గౌరవించి ఎన్నికల్లోనే నిలిచి గెలిస్తాడు చక్రవర్తి. ఆ తర్వాత అతన్ని రాష్ట్రంలోనే అత్యున్నతమైన స్పీకర్ చైర్ లో కూర్చోబెడతాడు సిఎమ్. ఇదీ కథ. కానీ ఇందులోని అసమానతలు, భావోద్వేగాలు, అణచివేతలు, ప్రేమకథ ఇలాంటివన్నీ మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. అందుకే ఈ మూవీకి థియేటర్స్ లో కూడా గొప్ప అప్లాజ్ వచ్చింది.

Related Posts