ప్రీక్వెల్ కు టైటిల్ దొరికింది.. కానీ

టాలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు శ్రీ విష్ణు. రిజల్ట్స్ తో పనిలేకుండా కొత్త తరహా సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ విజయాలు.. ఎక్కువగా అపజయాలు చూస్తున్నాడు. అయినా పంథా మార్చకుండానే వెళుతున్నాడు.

రీసెంట్ గా సామజవరగనా అనే సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఏకంగా 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శ్రీ విష్ణుకు ఇది చాలాచాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. అంతకు ముందు అతని హిట్ మూవీ రాజ రాజ చోర. హసిత్ గోలి డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అప్పట్లోనే ఈ మూవీకి ప్రీక్వెల్ చేస్తాం అని ప్రకటించారు. ఆ ప్రీక్వెల్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీకి ఓ టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట.


‘స్వాగ్’ .. ఇదీ టైటిల్ అంటున్నారు. స్వాగ్ అంటే అక్రమార్జన అని అర్థం ఉంది. అంటే అవినీతి సొమ్ము అని కూడా అనొచ్చు. ఈ అర్థంలో తెలుగులోనే ఇంకేదైనా క్యాచీ టైటిల్ పెడితే బావుంటుంది అని ఈ టైటిల్ విన్న ప్రతి ఒక్కరూ సజోస్ట్ చేస్తున్నారు. నిజానికి స్వాగ్ అనే పదాన్ని చాలామంది పాజిటివ్ కోణంలోనే వాడుతుంటారు. అలాంటి టైటిల్ ఈ కంటెంట్ కు పెడితే మైనస్ అయ్యే అవకాశాలున్నాయనేది కొందరి సూచన.

మొత్తంగా టైటిల్ వరకూ వచ్చారంటే త్వరలోనే చిత్రీకరణ కూడా మొదలవుతుందనుకోవచ్చు. రాజరాజచోర లో శ్రీ విష్ణుతో పాటు సునయన, మేఘా ఆకాశ్ నటించారు. వాళ్లు ఈ పార్ట్ లో కూడా ఉండకపోవచ్చు. అంటే కొత్త హీరోయిన్లు వస్తారు. మరోవైపు సామజవరగమనా హిట్ అయింది కాబట్టి.. ఈ చిత్రానికి బడ్జెట్ కాస్త పెంచుతున్నారట

Related Posts