సుధీర్.. వేరీజ్ గోట్

బుల్లితెరపై పెద్ద స్టార్డమ్ తెచ్చుకున్న వాళ్లు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షో నుంచి ఇమేజ్ తెచ్చుకున్న సుధీర్ తర్వాత తన మ్యాజిక్ షోస్ తోనూ మెప్పించాడు. అటు రష్మితో ప్రేమాయణం తరహా ఎపిసోడ్స్ అన్నీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే అతనికి బుల్లితెరపై మెగా ఇమేజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఈటివి, మాటివికి సంబంధించిన వీడియో ఏదైనా యూ ట్యూబ్ లో ఉందంటే సంబంధం లేకపోయినా సుధీర్ కు జై అనే కమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఇమేజ్ ఇచ్చిన ధైర్యంతోనేఅతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడా మంచి స్వాగతమే లభించింది. బట్ విజయం రాలేదు. మొదటి మూడు సినిమాలూ దారుణంగా పోయాయి. బట్ రీసెంట్ గా వచ్చిన గాలోడు అనే సినిమా కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయింది. రొటీన్ కంటెంట్ అయినా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. దీనికి తోడు సుధీర్ ఇమేజ్ కు దగ్గరగా ఉండటం కూడా ప్లస్ అయింది.

గాలోడు విజయం తర్వాత సుధీర్ కూడా దూకుడు పెంచాలనుకున్నాడు. అందుకే బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యాడు. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్స్ ఉన్నా.. టివి షోస్ కు నో చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా గోట్(G.O.A.T) అనే సినిమా ప్రారంభం అయింది. ప్రారంభం స్ట్రాంగ్ గానే ఉంది. కానీ ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏం కనిపిచండం లేదు. అసలు షూటింగ్ జరుగుతుందా ఆగిందా అనేది కూడా ఎవరికీ తెలియదు. కనీసం చిన్న చిన్న అప్డేట్స్ కూడా లేకపోవడంతో గోట్ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.


అయితే స్వయంకృషితో ఎదుగుతున్న హీరో మీద కావాలనే కొందరు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని సుధీర్ ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు. వారి కౌంటర్స్ ఓకే. కానీ నిజంగానే సినిమా గురించిన అప్డేట్ ఏం కనిపించడం లేదు. ఇవాళా రేపూ చిన్న పోస్టర్ వస్తుందంటేనో లేక ఒక షెడ్యూల్ అయిపోందంటూనో.. రోజుల తరబడి హంగామా చేస్తున్నారు. అలా చేస్తేనే ఆ సినిమా ఆడియన్స్ మైండ్ లోకి వెళుతుంది. రిలీజ్ వరకూ ఓ అంచనా వస్తుంది. ఈ విషయంలో గోట్ వెనకబడిందా లేక ఇంకేవైనా ప్లానింగ్స్ ఉన్నాయా అనేది తెలియదు కానీ గోట్ గురించి అప్డేట్స్ మాత్రం కనిపించడం లేదు.

Related Posts