ఆగస్ట్ 4న చిన్న సినిమాల జాతర

కొన్నాళ్లుగా పెద్ద హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం లేదు. దీంతో చిన్న సినిమాలదే హవా అవుతుంది. కానీ ఈ అవకాశాలను అందిపుచ్చుకుని హిట్ టాక్ తెచ్చుకునే చిత్రాలు మాత్రం చాలా అరుదుగా ఉన్నాయి. అయినా రిలీజ్ కు టైమ్ దొరికిందని ఎప్పటి నుంచో ఆగిపోయిన సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి.

ఇంకొందరైతే ఇలాంటి తరుణం కోసమే చూస్తున్నవారూ ఉన్నారు. ఎవరు వచ్చినా.. ఎప్పుడు వచ్చినా.. తాము తీసింది అద్భుతమైన సినిమా అనే ఫీలింగ్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తారు. ఆ ఫీలింగ్ఆడియన్స్ కూ కలిగితే కాసులు కురుస్తాయి. లేదంటే రెండో ఆటకే ఆ సినిమా గురించి జనం మర్చిపోతారు. ఇక ఈ వారం అలాంటి సినిమాల సందడి చాలా ఉంది. డైరెక్ట్, డబ్బింగ్స్ తో కలిపి అరడజనుకు పైగా సినిమాలు ఈ నెల 4న విడుదల కాబోతున్నాయి. వీటిలో ఈటీవి ప్రభాకర్ నటించిన ‘రాజుగారి కోడి పలావ్’ టైటిల్ వల్ల కాస్త ఎక్కువమందికి కనిపిస్తోంది. దిల్ సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్ చిత్రాలు డైరెక్ట్ తెలుగు సినిమాలుగా వస్తున్నాయి.


ఇక ఎమ్ఎస్ ధోనీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మించిన తొలి సినిమా ఎల్.జి.ఎమ్(Lets Get Married)గత శుక్రవారమే తమిళ్ లో విడుదలైంది. ఈ 4న తెలుగులో విడుదల కాబోతోందీ చిత్రం. తమిళ్ లో ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ఇక హాలీవుడ్ స్టార్ జాసన్ స్థాథమ్ నటించిన ‘మెగ్ 2 రాక్షస తిమింగలం’ అనే సినిమా ఆగస్ట్ 4న విడుదలవుతోంది.

ఈ మూవీ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. తమిళ్ నుంచి అర్జున్ దాస్ నటించిన బ్లడ్ అండ్ చాక్లెట్, కన్నడ నుంచి సుదీప్ నటించిన హెబ్బులి డబ్బింగ్ సినిమాలుగా విడుదలవుతున్నాయి. వీటిలో బ్లడ్ అండ్ చాక్లెట్ కు తమిళ్ లో మంచి రివ్యూస్ వచ్చాయి.


ఇవి కాక రెండు రీ రిలీజ్ లు కూడా ఈ వారం సందడి చేయబోతున్నాయి. 4న సూర్య నటించిన సూర్య సన్నాఫ్‌ కృష్ణన్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో తెలుగులో ఈ చిత్రం పెద్ద హిట్ కాదు. కానీ తర్వాత టివిలు, యూ ట్యూబ్ లో బాగా చూశారు. ఇక మన నందమూరి నటసింహం బాలకృష్ణ ‘భైరవ ద్వీపం’ 4కే టెక్నాలజీకి అప్డేట్ అయ్యి ఆగస్ట్ 5న రీ రిలీజ్ అవుతోంది. మరి వీటిలో ఏ సినిమాలకు ఆడియన్స్ ఓటేస్తారో కానీ.. మొత్తం మూడు రోజుల్లో తొమ్మిది సినిమాలు వస్తున్నాయి.

Related Posts