‘గుంటూరు కారం‘ పైనే ఆశలు పెట్టుకున్న శ్రీలీల

తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన రెండేళ్లకే టాప్ ప్లేసుకి దూసుకెళ్లింది శ్రీలీల. వరుసగా స్టార్ హీరోస్ తో నటించే ఛాన్సెస్ అందుకుంది. సినిమా సినిమాకి మధ్య అస్సలు గ్యాప్ లేకుండా వరుస షూటింగ్స్ తో బిజీ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కిట్టీలో కేవలం రెండంటే రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలీదు.

గతేడాది శ్రీలీల నుంచి ‘స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘ వంటి నాలుగు సినిమాలొచ్చాయి. వీటిలో ‘భగవంత్ కేసరి‘ ఒక్కటే హిట్. దాంతో ఇప్పుడు తన ఆశలన్నీ ‘గుంటూరు కారం‘పైనే పెట్టుకుంది ఈ బ్యూటీ. తొలుత ఈ మూవీలో శ్రీలీల సెకండ్ లీడ్ మాత్రమే. పూజా హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ గా వచ్చింది.

‘గుంటూరు కారం‘ తర్వాత శ్రీలీల కిట్టీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ ఉంది. ఇప్పటికే చాలా భాగం కంప్లీట్ అవ్వాల్సిన ‘ఉస్తాద్..‘ పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడంతో డిలే అవుతోంది. అలాగే.. విజయ్ దేవరకొండతో సితార నిర్మించే సినిమాలోనూ శ్రీలీల కథానాయికగా ఎంపికయ్యింది. ఆ చిత్రం కూడా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంమీద.. ‘గుంటూరు కారం‘ తర్వాత శ్రీలీల సినిమాల స్పీడు విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Related Posts