ఐటమ్ సాంగ్ లో శ్రీ లీల

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల. తనే ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది. వరుసగా టాప్ హీరోలతో పాటు స్మాల్ హీరోలతోనూ నటిస్తూ.. రేస్ లో దూసుకుపోతోంది. అమ్మడి దూకుడుకు ఆల్రెడీ టాప్ అనిపించుకున్న పూజాహెగ్డే, రష్మిక మందన్నా సైతం సైడ్ అయిపోతున్నారంటే ఆ స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మహేష్ తో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్‌ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ, రామ్ తో స్కంద, నితిన్, నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. వీటితో పాటు బాలకృష్ణ భగవంత్ కేసరిలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంత బిజీగా ఉన్న అమ్మడి దగ్గరకు ఓ క్రేజీ ఐటమ్ సాంగ్ ఆఫర్ వెళ్లింది.


టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేస్తే ఆ పాటకు వచ్చే క్రేజ్ వేరే ఉంటుంది. ఇంతకు ముందు అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మూవీలో సమంత చేసిన పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా సెకండ్ పార్ట్ లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాట కోసమే శ్రీ లీలను అప్రోచ్ అయ్యారు. ప్రస్తుతం తను ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ ఈ పాట చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

పుష్ప ది రూల్ పై భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. వాల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ ఆడియన్స్ ను కూడా చేరుతుంది. ఇలాంటి సినిమాలో స్పెషల్ సాంగ్ లో తళుక్కువంటే తనకూ ఆ రేంజ్ గుర్తింపు వస్తుంది.

పైగా తను మంచి డ్యాన్సర్ కూడా. అల్లు అర్జున్ లాంటి డ్యాన్సింగ్ ఐకన్ తో డ్యాన్స్ చేస్తే వచ్చే గుర్తింపు ఇంకా పెరుగుతుంది. వీటికి తోడు భారీ చెక్ కూడా ఆఫర్ చేశారట. అయినా కానీ ఇప్పుడే ఎదుగుతున్న తను అప్పుడే ఐటమ్ సాంగ్ చేస్తే అది తన కెరీర్ పై ప్రభావం చూపిస్తుందేమో అనే భయంలో కూడా ఉందట. మరి తను ఈ పాటలో చేస్తుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Related Posts