‘బ్రో’లో పవన్ ఎన్ని పాటలకు డ్యాన్స్ వేశాడు.. ?

‘బ్రో’.. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కు మాత్రం చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ అనిపించుకుంది. ఆయన ఎనర్జీ లెవల్సే ఈ సినిమాకు ప్రాణం. ఒక రకంగా వింటేజ్ పవన్ ను చూస్తున్నాం అని ఫ్యాన్స్ అంతా ఫీలయ్యారంటే ఆ క్రెడిట్ దర్శకుడితో పాటు త్రివిక్రమ్ దే.

ఆయన రైటింగ్ లో తను ఎలాంటి పవన్ ను చూడాలనుకుంటున్నాడో అలాంటి పవన్ ను రాశాడు. ఇక దర్శకుడి టేకింగ్ లో పవన్ మరింతగా రెచ్చిపోయాడు. ముఖ్యంగా చిత్రలహరి ఎపిసోడ్స్ అన్నీ హిలేరియస్ గా ఉన్నాయని చెప్పాలి. విశేషం ఏంటంటే.. ఈ పాటలన్నీ ఆయన సినిమాల్లోనివే. దీంతో ఫ్యాన్స్ కు మరింత కిక్ వచ్చింది. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ఏ ఏ పాటల్లో ఆకట్టుకున్నాడో తెలుసా…?


తమ్ముడు సినిమాలోని వయారి భామా నీ హంస నడకా సాంగ్ ఉంది. ఈ పాటలో అప్పట్లోనే లుంగీ కట్టి రైల్వే కూలీలా అదరగొట్టాడు. ఇప్పుడు ఆయన రేంజ్ మారింది. అయినా అదే పాటను అలాగే రిపీట్ చేయడం బలే వర్కవుట్ అయింది. ఓ రకంగా ఈ పాటలన్నిటిలోనూ ఇదే హైలెట్ గా కనిపిస్తుంది.


నెక్ట్స్ తన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ తొలిప్రేమలోని ఏమి సోదరా మనసుకు ఏమైందిరా అనే పాట. ఇదీ అదిరిపోయింది. ఇక నెక్ట్స్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన జల్సా సినిమాలోని టైటిల్ సాంగ్. ఈ పాటలోని విన్యాసాలను మరోసారి రిపీట్ చేయడం చూసి ఫ్యాన్స్ అంతా వెర్రెత్తిపోయారనే చెప్పాలి. ఇది పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా కావడంతో మరింత రెచ్చిపోయారు. ఖుసీ సినిమాలోని ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే పాట మరోసారి మెస్మరైజ్ చేసింది. పవన్ కళ్యాణ్‌ పూర్తిగా డిఫరెంట్ మేకోవర్, క్యారెక్టరైజేషన్ తో వచ్చిన గుడుంబా శంకర్ సినిమా అప్పట్లో కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా ఇప్పుడు ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ సినిమాలోని కిళ్లీ కిళ్లీ అనే పాటవచ్చినప్పుడు థియేటర్స్ అన్నీ జోష్ తో నిండిపోయాయి.


తన రీసెంట్ హిట్ భీమ్లా నాయక్ లోని టైటిల్ సాంగ్ అయిన లాలా భీమ్లా పాటతో పాటు గుడుంబా శంకర్ లోనిదే చిట్టి నడుమునే చూస్తున్నా అనే పాటలు అదరగొట్టాయి. థియేటర్స్ ను హెరెత్తిపోతున్నాయి అన్న ప్రతి సందర్భంలోనూ ఈ పాటలు వచ్చాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్‌ ను చాలా రోజుల తర్వాత నెక్ట్స్ లెవెల్ ఎనర్జీతో చూసిన ఫ్యాన్స్‌ మొన్నటి వరకూ రీమేక్ చేస్తున్నాడు అన్న బాధను మర్చిపోయారు.

Related Posts