జగన్ పై పవన్ సెటైర్స్

సినిమావాళ్లు రాజకీయాల్లోనూ ఉంటే సౌలభ్యం వేరే ఉంటుంది. సినిమాల ద్వారా ప్రత్యర్థులపై సెటైర్స్ వేయొచ్చు. వాటిని కథలో భాగం అని చెప్పేయొచ్చు. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. సినిమా ఏదైనా ప్రభుత్వాలపై సెటైర్స్ వేయడం ఆయన సినిమాల్లో నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది.

చాలా వరకూ అవి కావాలని రాసుకునే డైలాగ్స్ అని అందరికీ తెలుసు. అలాంటి డైలాగ్స్ కు ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్‌ కూడా తన సినిమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్స్ వేస్తుంటాడు. కాకపోతే పవన్ కళ్యాణ్‌ బాలయ్యలా స్ట్రాంగ్ గా కాక కాస్త లైట్ డోస్ లో డైలాగ్‌స్ వేస్తుంటాడు.


పవన్ కళ్యాణ్‌ లేటెస్ట్ మూవీ బ్రో లో డైరెక్ట్ గా జగన్ నే టార్గెట్ చేస్టూ ఒకట్రెండు డైలాగ్స్ ఉన్నాయి. అందులో అందరినీ ఆకట్టుకున్న మాట ఒకటి చూస్తే అది జగన్ అవినీతిని ప్రశ్నిస్తున్నట్టుగానే ఉంది. “నువ్వు ఎంత దోచుకున్నా.. ఎన్ని కబ్జాలు చేసినా పోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్లలేవు.. ” ఇదీ సినిమాలో ఒక సందర్భంలో వచ్చే డైలాగ్.

జగన్ అనగానే అవినీతి నాయకుడు అనే కదా ప్రతిపక్షాలు అంటున్నాయి. దాన్నే తన స్టైల్లో డైలాగ్ రూపంలో వేశాడు పవన్. అఫ్‌ కోర్స్ ఇది రాసింది త్రివిక్రమ్ అయినా.. పవన్ కుఅన్నీ రాసేది ఆయనే కదా.. అందుకే డైరెక్ట్ గా జగన్ కే తగిలేలా ఉందీ డైలాగ్. దీంతో మరో చోట ” హాల్లో షర్ట్ విప్పొచ్చు, బెడ్ రూమ్ లో ప్యాంట్ విప్పొచ్చు, బాత్రూమ్ లో అండర్ వేర్ కూడా విప్పొచ్చు.. వీడికి ఎక్కడ విప్పాలో ..” అనే డైలాగ్ ఉంది.

అంటే జగన్ ను ప్రజాక్షేత్రంలో బట్టలు ఊడదీసి నిలబెడతా అని ఈ మధ్య పొలిటికల్ స్పీచుల్లో అంటున్నాడు. దానికి రిలేట్ చేస్తూ ఈ డైలాగ్ వాడాడు అనుకోవచ్చు. మొత్తంగా ఇలాంటి డైలాగ్స్ ఇంకా ఇంకా బయటకు వస్తూనే ఉంటాయని చెప్పొచ్చు.

Related Posts