అంగరంగ వైభవంగా సౌత్ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌

సౌత్ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (SIFF) ప్రారంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘కల్కి’ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ స్వప్న దత్‌తో, ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ నేతృత్వంలో సాగిన ఫైర్‌సైడ్ చాట్ హైలైట్ గా నిలిచింది . అలాగే అల్లు అరవింద్, మయాంక్‌ శేఖర్‌, మోడరేటర్ వాణీ రాణే లు తెలుగు సినిమా గురించి చెప్పిన మాటలతో కార్యక్రమం అద్భుతంగా సాగింది. ఆహా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించిందీ వేడుక.


సాయంత్రం పూట జరిగిన వేడక నభూతో నభవిష్యతి అన్న చందంగా సాగింది. రెడ్ కార్పెట్‌ వేడుక ఆకర్షణీయంగా సాగింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, ఇటీవల పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్న చిరంజీవి గారిని సత్కరించారు. మెగాస్టార్ ప్రజెన్స్ ఈ వేడుకకు గొప్ప వైభవాన్ని తెచ్చిపెట్టింది.


మంచు లక్ష్మి, నవదీప్‌ల హోస్టింగ్‌ ఈ వేడుకకు హైలైట్‌. ఈవెంట్‌లో, మూడు విభాగాల్లో విజేతల ప్రకటించారు: జనవరి 1 2020 మధ్య నిర్మించిన షార్ట్ ఫిల్మ్ (3 నుండి 15 నిమిషాలు), స్ప్రైట్ షార్ట్ షార్ట్ (3 నిమిషాలలోపు), మ్యూజిక్ వీడియోలు 60 నిమిషాలలోపు లాంగ్ ఫార్మాట్ ఫిల్మ్ ఈ కేటగిరీలో వున్నాయి. మెగాస్టార్‌కి తేజ సజ్జా ఇచ్చిన ట్రిబ్యూట్ సాయంత్రం హైలైట్‌లలో ఒకటి గా నిలిచింది. తేజ సజ్జా డాన్స్ పర్‌ఫార్మెన్స్‌తో అద్దరగొట్టాడు.


ఆహా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు రావడం చాలా ఆహ్లాదకరంగా వుంది. ఈ వేడుకలో నాకు చిరు సత్కారం జరగడం కూడా చాలా ఆనందంగా వుంది. నాకు పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చిన ఉదయాన్నే మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చి పుష్ప గుచ్చం ఇచ్చి చాలా ఆనందం పొందిన వ్యక్తి మురళీ మోహన్ గారు. ఆ రోజు మొదలుకొని ఐదారు రోజులు వరకూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చి అభినందించారు, సన్మానించారు, ఆనందపడ్డారు. ఐదారు రోజులు పాటు ఒక సంబరంలా వేడుక జరిగిందనే ఆనందం నాకు వుంది. ప్రతి కళాకారుడికి సామాజిక భాద్యత వుంటుంది. ప్రేక్షకులు మనకు పంచిన ప్రేమకు బదులుగా మనం ఏం తిరిగి ఇస్తున్నామని లోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రజా సేవకుడు అవుతారు. సమయానికి రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పత్రికల్లో చదివినప్పుడు మనసు కలిచివేసింది. సమయానికి రక్త ఇచ్చినట్లయితే ఒక ప్రాణం నిలబెట్టినవారం అవుతాం కదా అనే ఆలోచనతో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. నా అభిమానుల మీద నమ్మకంతోనే అది పెట్టాను. ఈ రోజుకీ నిరంతరంగా అది కొనసాగుతుందంటే కనుక అభిమానులు వలనే సాధ్యపడుతుంది. ఈ సందర్భంగా వారందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.

రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలోకి వచ్చిన సమయంలో అదే ఆదరణ ప్రేమ ఉటుందా ? అనే ఆలోచన వుండేది. నా సినిమాలో డైలాగ్ ఒకటివుంది. ‘ఎన్నాళ్ళైనా అదే పౌరుషం, అదే రక్తం’. ఇదే డైలాగ్ నేను తిరిగి సినిమా ల్లోకి వచ్చినపుడు ప్రేక్షకులు నాకు చెప్పినట్లునిపించింది.’అదే ఆదరణ, అదే ప్రేమ, అదే అభిమానం, అదే గుండెల్లో మీ చోటు” అన్నట్టుగా అనిపించింది. 150 సినిమా నుంచి ఈ క్షణం వరకూ అదే ఎనర్జీ పొందుతున్నాను. ప్రేక్షకుల స్పందన, అభిమానమే ఎనలేని ఉత్సాహన్ని ఇస్తున్నాయి. ఓపిక వున్నంతం వరకూ, మీరు ఆదరించేవరకూ సినిమాల్లోనే వుంటాను. ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ ఆవశ్యకత ఎంతైనా వుంది. యువ ప్రతిభని ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. అలాంటి అవకాశం ఈ వేదిక ఇచ్చింది. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ ని ప్రజెంట్ చేస్తున్న వారంతా సూపర్ సక్సెస్ అవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆహా వారి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.” అన్నారు మెగాస్టార్ చిరంజీవి.


మిగతా సెలబ్రిటీలు, అతిధులు, నటీనటులు.. సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్ నిర్వాహకులను, విజేతలను అభినందించారు.

Related Posts