ఓం భీమ్‌ బుష్ సక్సెస్‌ మీట్‌

‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్’. హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ చేసిన ఈ మూవీ మార్చి 22 న రిలీజై హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌ అందిస్తుంది. అన్ని ఏరియాలనుంచి, అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాబడుతోంది. యువి క్రియేషన్స్‌ సమర్పించిన ఈ మూవీ సూపర్‌హిట్‌ టాక్‌ నేపథ్యంలో సక్సెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం.హర్ష ఈ కథ చెప్పినప్పుడు థియేటర్స్ లో కడుపుబ్బా నవ్వించాలని నిర్ణయించుకునే ఈ సినిమా చేశాను. అది ఈ రోజు అద్భుతంగా నిరూపితమైయింది. ఈ కథ చెప్పి రాహుల్, దర్శిని కన్విన్స్ చేసి తెచ్చినప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని ఫిక్స్ అయ్యాను. రాహుల్, దర్శి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయన్నారు శ్రీవిష్ణు.

మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుందన్నారు నవ్వుతూ రాహుల్ రామకృష్ణ. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతా వారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనందం పడుతున్నాం. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులు ధన్యవాదాలు” తెలిపారు.


థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయాం. ప్రిమియర్స్ నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన వారంతా చాలా అద్భుతంగా వుందని చెప్పారు. మంచి రివ్యూస్ వచ్చాయి. ఇలాంటి సినిమా గ్యాంగ్స్ తో వెళ్లి చూస్తే ఇంకా మజా వుంటుంది. తప్పకుండా థియేటర్స్ లో నే చూడండన్నారు దర్శకుడు శ్రీహర్ష.

Related Posts