పెళ్లి రూమర్స్ పై త్రిష స్వీట్ ట్వీట్

ఏజ్ తో పాటు గ్లామర్ కూడా పెరుగుతున్న బ్యూటీ త్రిష. కెరీర్ మొదలుపెట్టి 20ఏళ్లవుతున్నా..ఇంకా అలాగే ఉంది అనుకుంటారు అభిమానులు. అందంలోనే కాదు.. ఆఫర్స్ లోనూ టాప్ లోనే ఉందీ సోయగం. ఇప్పటికీ టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీస్ తోనూ ఆకట్టుకుంటోంది. అయితే కొన్నాళ్ల క్రితం తను దగ్గుబాటి రానాతో ఒక ఎఫైర్ నడిపింది అని ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత తను ఓ బిజినెస్ మేన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఏమైందో.. ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి మళ్లీ కెరీర్ పైనే ఫోకస్ చేసింది. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ లో త్రిషను చూసిన అభిమానులు మరోసారి హార్ట్స్ పారేసుకున్నారు. అంత అందంగా ఉంది.


ప్రస్తుతం విజయ్ సరసన తను నటించిన లియో సినిమా అక్టోబర్ 19న విడుల కాబోతోంది. అలాగే తెలుగులో ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం ఉంది. తమిళ్ లో అజిత్ తో మరో సినిమా చేయబోతోంది. అటు మళయాలంలోనూ నటిస్తోంది. మొత్తంగా ఇప్పటికీ తన చేతిలో అరడజను ప్రాజెక్ట్ లు ఉన్నాయంటే ఆశ్చర్యమేం లేదు. ఇలా తన కెరీర్ లో తనుంటే కొన్ని రోజులుగా త్రిష పెళ్లి చేసుకోబోతోంది అనే రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. కోలీవుడ్ మీడియాలో ఈ వార్తలను నిజమే అంటూ ప్రసారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. ఇంత బిజీగా ఉన్న తను పెళ్లి చేసుకుంటుందా అని కొందరు ఆశ్చర్యపోయారు. అయితే ఇవి రూమర్స్ అనుకునే అవకాశం కూడా లేకుండా ఆ వార్తలను వ్యాప్తి చేస్తున్నారు కొందరు. దీనిపై మరీ ఎక్కువ లేట్ చేయకుండా తనదైన శైలిలో స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయింది త్రిష.


త్రిషన తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ లో ఈ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చింది.. ” డియర్.. మీరు ఎవరో, మీ టీమ్ ఎవరో మీకు తెలుసు. ప్రశాంతంగా ఉండండి. ఈ రూమర్స్ ను ఆపేయండి.. చీర్స్..” అంటూ పోస్ట్ చేసింది. ఇది లియో సినిమా పోస్టర్ లో కోట్ లా ఉన్నా.. తనపై ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్నది ఎవరో త్రిషకు తెలుసు అనేదే ఆశ్చర్యంగా ఉంది. అంటే కావాలనే కొందరు తనను టార్గెట్ చేసి ఈ వార్తలను వ్యాపింప చేస్తున్నారు అనే కదా దీనర్థం. ఏదేమైనా త్రిష ఎక్స్ తర్వాత ఈ వార్తలు మళ్లీ వచ్చినా జనం ఇక నమ్మరు.

Related Posts