పులి ఏటకొచ్చిందీ .. స్కంద ట్రైలర్…

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం స్కంద. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ ౧౫న విడుదల కాబోతోంది. తాజాగా బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.


ఈ ట్రైలర్ చూస్తే ఇది పూర్తిగా బోయపాటి మార్క్ సినిమా లా కనిపిస్తోంది. ఏ మాత్రం కొత్తదనం లేదు. అవే ఊర మాస్ ఫైట్స్, అవే రొటీన్ ఎలివేషన్స్.. కాకపోతే ఇమేజ్ కి భిన్నమైన పాత్రలో రామ్ కనిపిస్తున్నాడు అంతే.

బోయపాటి సినిమాల్లో కనిపించే రెగ్యులర్ మాస్ డైలాగ్స్ తో ట్రైలర్ నిండిపోయింది. ఇంకా చెబితే బాలయ్య రేంజ్ డైలాగ్స్ అవి. కంప్లీట్ ఫామిలీ ఆక్షన్ ప్యాకెడ్ డ్రామా లా ఉంది. కొన్ని సీన్స్, షాట్స్ సరైనోడు మూవీ ని గుర్తు చేస్తున్నాయి. శృతి మించిన రక్తపాతం ట్రైలర్ లోనే ఉంది. ఇంక సినిమా లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


రామ్ కి ఈ పాత్ర కొత్తగా ఉండొచ్చు. బోయపాటి సినిమాలు చూసేవారికి చాల పాత కథ లా ఉంది. ఒక్క వ్యక్తి లెక్కకు మించిన జనాల్ని చంపేయడం అనే ఫార్మాట్ నుంచి బోయపాటి ఎప్పుడు బయటకు వస్తాడో కానీ అతని పాత సినిమాల మాష్ అప్ వీడియోస్ లా ఉందీ ట్రైలర్..

Related Posts