మెగాస్టార్ గా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమాను ఏలేస్తున్నాడు చిరంజీవి. ఇన్నేళ్లుగా ఆయన సంపాదించుకున్న అభిమానులు ఆయన కుటుంబం మొత్తానికి అండగా నిలుస్తున్నారు. తను మర్రి చెట్టులా కాక మామిడి చెట్టులా మారి మెగా తోటను టాలీవుడ్ మొత్తం విస్తరించాడు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగానూ మారారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. చిన్న సినిమాకు అండగా నిలుస్తున్నారు. పెద్ద సినిమాలు బావుంటే అప్రిసియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ అనే సినిమాతో వస్తున్నాడు.
ఈ నెల 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు ఆయన హోదాకు, స్థాయికి తక్కువగా ఉన్నాయనే కమెంట్స్ వస్తున్నాయి. నిజమే.. తన వయసును సినిమాలో దాచేయొచ్చు. చిందులు వేయొచ్చు. కానీ వేదికలపై వయసుకు తగ్గట్టుగా కూడా మాట్లాడాల్సి ఉంటుంది. పైగా తనిప్పుడు ఇండస్ట్రీకి పెద్దగానూ ఉన్నారు.
భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాటలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా కీర్తి సురేష్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి ఏ మాత్రం సరిపోనివి. ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లెలుగా నటించింది. కానీ తనను అన్నయ్య అని అస్సలు పిలవొద్దు అని చెప్పానని.. ఇంత అందమైన అమ్మాయి అన్నయ్య అంటే మనసు కలుక్కుమంటుందని.. రేపు కీర్తి సురేష్ తన హీరోయిన్ గా నటిస్తే ఈ పదం గుర్తొస్తుంది. కాబట్టే.. అన్నయ్య అని పిలవొద్దు అని గట్టిగా చెప్పాను అని సభాముఖంగా చెప్పడం ఆయన స్థాయికి ఏ మాత్రం సరిపోయేలా లేవు.
చాలా ఇమెచ్యూర్ గా ఉన్నాయి ఈ మాటలు. కీర్తి సురేష్ ఏమంత పెద్దావిడ కాదు. ఆయన కూతురు వయసున్న అమ్మాయి. అలాంటి హీరోయిన్ తో నటించాలని మనసులో ఉంటే.. అదే చేసి ఉండాల్సింది. కానీ ఒక పాత్రను పాత్రగా కూడా గుర్తించలేను అనడం మాత్రం అస్సలు బాలేదు. అప్పటి వరకూ అద్భుతంగా మాట్లాడిన ఆయన కీర్తి సురేష్ విషయంలో చెప్పిన మాటలు, చేష్టలు.. ఆయన హోదాకు తగ్గట్టుగా లేవు. హుందాగానూ అనిపించలేదు.
ఇది చాలామంది ఆయనపై కామెంట్స్ చేయడానికి కారణం అవుతుంది. పైగా అంతమంది అభిమానుల ముందు ఒక అమ్మాయితో ఇలా మాట్లాడటం సరైంది కాదు కూడా. కీర్తి ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తూనే ఇబ్బందిగానూ ఫీలయ్యింది. ఈ ఫంక్షన్ ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగా ఉంది తన పరిస్థితి. మొత్తంగా చిరంజీవి గారూ.. మీరు లీకులు ఇచ్చినా ఫర్వాలేదు కానీ.. ఇలా స్థాయిని తగ్గించుకుని మాట్లాడితే మళ్లీ ఎదుటి వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే ఇకనైనా కొన్ని విషయాలు ”మనసులోనే” దాచుకుంటే మంచిది. లేదంటే ఈ వయసులో అనవసరమైన మాటలు పడాల్సి ఉంటుంది.
Not only the first song from 'Devara'.. the second song is also coming as a…
Television actor Chandu's suicide has created a sensation. Serial actress Pavitra died in a car…
Natural Star Nani is on a good streak. He has a string of hits to…
తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…
ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…
నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…