చిరంజీవి గారూ.. ఇదేం బాలేదు సర్

మెగాస్టార్ గా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమాను ఏలేస్తున్నాడు చిరంజీవి. ఇన్నేళ్లుగా ఆయన సంపాదించుకున్న అభిమానులు ఆయన కుటుంబం మొత్తానికి అండగా నిలుస్తున్నారు. తను మర్రి చెట్టులా కాక మామిడి చెట్టులా మారి మెగా తోటను టాలీవుడ్ మొత్తం విస్తరించాడు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగానూ మారారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. చిన్న సినిమాకు అండగా నిలుస్తున్నారు. పెద్ద సినిమాలు బావుంటే అప్రిసియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ అనే సినిమాతో వస్తున్నాడు.

ఈ నెల 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు ఆయన హోదాకు, స్థాయికి తక్కువగా ఉన్నాయనే కమెంట్స్ వస్తున్నాయి. నిజమే.. తన వయసును సినిమాలో దాచేయొచ్చు. చిందులు వేయొచ్చు. కానీ వేదికలపై వయసుకు తగ్గట్టుగా కూడా మాట్లాడాల్సి ఉంటుంది. పైగా తనిప్పుడు ఇండస్ట్రీకి పెద్దగానూ ఉన్నారు.


భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాటలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా కీర్తి సురేష్‌ పై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి ఏ మాత్రం సరిపోనివి. ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లెలుగా నటించింది. కానీ తనను అన్నయ్య అని అస్సలు పిలవొద్దు అని చెప్పానని.. ఇంత అందమైన అమ్మాయి అన్నయ్య అంటే మనసు కలుక్కుమంటుందని.. రేపు కీర్తి సురేష్ తన హీరోయిన్ గా నటిస్తే ఈ పదం గుర్తొస్తుంది. కాబట్టే.. అన్నయ్య అని పిలవొద్దు అని గట్టిగా చెప్పాను అని సభాముఖంగా చెప్పడం ఆయన స్థాయికి ఏ మాత్రం సరిపోయేలా లేవు.

చాలా ఇమెచ్యూర్ గా ఉన్నాయి ఈ మాటలు. కీర్తి సురేష్ ఏమంత పెద్దావిడ కాదు. ఆయన కూతురు వయసున్న అమ్మాయి. అలాంటి హీరోయిన్ తో నటించాలని మనసులో ఉంటే.. అదే చేసి ఉండాల్సింది. కానీ ఒక పాత్రను పాత్రగా కూడా గుర్తించలేను అనడం మాత్రం అస్సలు బాలేదు. అప్పటి వరకూ అద్భుతంగా మాట్లాడిన ఆయన కీర్తి సురేష్ విషయంలో చెప్పిన మాటలు, చేష్టలు.. ఆయన హోదాకు తగ్గట్టుగా లేవు. హుందాగానూ అనిపించలేదు.

ఇది చాలామంది ఆయనపై కామెంట్స్ చేయడానికి కారణం అవుతుంది. పైగా అంత�