రహస్యంగా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్-అదితిరావు హైదరీ?

పేరుకు తమిళవాడే అయినా.. తెలుగులో హీరోగా భారీ విజయాలు అందుకున్నాడు సిద్ధార్థ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు‘ వంటి సినిమాలు సిధ్దుకి అప్పటి యూత్ తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. అయితే.. గత కొన్నేళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. గతంలో సిద్ధార్థ్ మేఘనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ 2007లో విడిపోయారు.

గత కొన్ని నెలలుగా నటీమణి అదితి రావు హైదరీతో ప్రేమలో ఉన్నాడు సిద్ధార్థ్. ‘మహా సముద్రం‘ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. కొన్ని రోజులుగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారట. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ మండపంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు, కొంతమంది స్నేహితులకి మాత్రమే ఆహ్వానం అందిందట.

Related Posts