పర్ఫెక్ట్ టైములో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ఇప్పుడో బ్లాక్ బస్టర్ కావాలి. ‘లైగర్’తో పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న విజయ్.. ‘ఖుషి’తో కాస్త ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘ఫ్యామిలీ స్టార్’పైనే పెట్టుకున్నాడు. ఇప్పటికే తనకు ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ రూపొందింది.

‘గీత గోవిందం’ వైబ్స్ తోనే పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘ఫ్యామిలీ స్టార్’ వస్తోంది. పరశురామ్ కి తోడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘ఫ్యామిలీ స్టార్’కి మెయిన్ పిల్లర్ గా ఉన్నాడు. ఏప్రిల్ నెలలో వేరే పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో ‘ఫ్యామిలీ స్టార్’కి మంచి టాక్ వచ్చిందంటే చాలు ఈ సమ్మర్ సీజన్ అంతా దున్నేయొచ్చు. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించొచ్చు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా లక్కీ ఛార్మ్ మృణాల్ ఠాకూర్ నటించింది. ఇప్పటికే తెలుగులో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మృణాల్ కి ఇది మూడో సినిమా. ‘గీత గోవిందం’ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గోపీ సుందర్ సపోర్ట్ కూడా ‘ఫ్యామిలీ స్టార్’కి ఉంది. మొత్తంమీద.. పర్ఫెక్ట్ టైములో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండకి అత్యద్భుతమైన విజయాన్నందిస్తుందేమో చూడాలి.

Related Posts