బ్యాక్ గ్రౌండ్ పెద్దగా ఉన్నా చిన్న సినిమాలతో ఆకట్టుకుంటూ ప్రయాణిస్తున్నాడు శ్రీ సింహా కోడూరి. ఎమ్ఎమ్ కీరవాణి తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ సింహా హీరోగా ఫస్ట్ మూవీ మత్తువదలరాతో మెప్పించాడు. ఆ తర్వాత పెద్ద సక్సెస్ లు లేకపోయినా.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ఉస్తాద్ అనే మూవీ టీజర్, సాంగ్ తో ఆకట్టుకున్న శ్రీ సింహా ఇప్పుడు మరో మూవీ రిలీజ్ డేట్ తో వచ్చాడు.
తన లేటెస్ట్ మూవీ భాగ్ సాలే న జూలై 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ టైటిల్ తోనే సగం ఆకట్టుకుంది మూవీ టీమ్. ఇక జూలై 7న నాగశౌర్య రంగబలి కూడా విడుదలకు ఉంది. శౌర్య .. శ్రీ సింహాకు పెద్దగా పోటీ ఇస్తాడు అనుకోలేం.
ఇక అర్జున్ దాస్యం, యశ్ రంగినేని, కళ్యాణ్ సింగనమల సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్ట్ చేశాడు. శ్రీ సింహా సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, వర్షిణి ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంతో శ్రీ సింహా మంచి విజయం సాధిస్తాడు అని చెబుతోంది టీమ్.
యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా…
ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నిర్మాత దిల్రాజు.. ఈసారి ఓ దెయ్యం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.…
స్టార్ హీరోలు నటించే సినిమాల ఆడియో రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారు నటించే సినిమాల ఆడియో రైట్స్…
Young hero Raj Tarun's latest movie is 'Purushothamudu'. Dr. Ramesh Tejawat and Prakash Tejawat are…
చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై పరిచయమై.. 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా సెటిలైన బ్యూటీ అవికా గోర్. మొదట్లో 'సినిమా చూపిస్తా…
కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే…