శ్రీ లీల రెండు నెలలు షూటింగ్స్ బంద్

ఒకప్పుడు డాక్టర్ కాబోయే యాక్టర్ అయిపోయామని గొప్పలు పోయేవాళ్లు హీరోయిన్లు. ఇప్పుడు అలా కాదు.. డాక్టర్లు అయిన తర్వాత అవసరమైతే డాక్టర్ చదువుకుంటూ కూడా యాక్టర్స్ అయిపోతున్నారు. ఇప్పటికే తెలుగులో సాయి పల్లవి, మీనాక్షి చౌదరి, సాక్షి వైద్య, మిస్టర్ ప్రెగ్నెంట్ ఫేమ్ రూపా కొడవుయూర్ లాంటి హీరోయిన్లు డాక్టర్స్ గా ఉన్నారు.

వారిలా తను కూడా డాక్టర్ చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చింది శ్రీ లీల. తను ఇప్పుడు ఎమ్. బి.బి.ఎస్ ఫైనల్ ఇయర్ లో ఉంది. ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కోసమే తను రెండు నెలల పాటు సినిమాలు, షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వబోతోంది. నిజానికి తన చేతిలో ఉన్న ఆఫర్స్, తన క్రేజ్ చూస్తే ఇప్పుడీ సర్టిఫికెట్ అవసరమా అని ఎవరైనా అనుకుంటారు. కానీ తను ఆ డాక్టర్ చదువును ఎంత ప్రేమిస్తుంది అనేందుకు ఇదో నిదర్శనం.


ఈ యేడాది చివర్లో తనకు ఎగ్జామ్స్ ఉన్నాయట. అందుకే చదువుతో పాటు ప్రాక్టికల్స్ కు కూడా టైమ్ ఇవ్వాలని నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిగా షూటింగ్స్ కు ప్యాకప్ చెప్పేసింది. ఈ నెండు నెలలు తను కాస్త కష్టపడి పరీక్షలు రాస్తే ఆ డాక్టర్ డిగ్రీ చేతికి వస్తుంది. అప్పుడు తను కొంతమంది యాక్టర్స్ లా కొనుకున్న డాక్టరేట్ తో కాకుండా కష్టపడి చదువుకున్న డాక్టర్ గా పిలవబడుతుందన్నమాట. మరి ఈ యాక్టర్ కమ్ కాబోయే డాక్డర్ కు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.

Related Posts