ఆలూ లేదు చూలూ లేదు అన్నట్టుగా అనౌన్స్ మెంట్ లేదు.. షూటింగ్ స్టార్ట్ కాలేదు కానీ మా సినిమా రిలీజ్ డేట్ ఇదే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అక్కినేని నాగార్జున నెక్ట్స్ మూవీ ఏంటనేది ఇంకా ఫిక్స్ కాలేదు. అయినా అనౌన్స్ మెంట్ రాలేదు. బట్ రిలీజ్ మాత్రం సంక్రాంతికే అని ఫిక్స్ అయ్యారట. అంటే వీరి ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా లేకుంటే అంత ధైర్యంగా ఈ డేట్ అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నారు కదా..
నిజమే..నాగార్జున ప్లానింగ్ కు ఎప్పుడూ తిరుగుండదు. కొన్నాళ్లుగా సరైన సబ్జెక్ట్ కోసం చూస్తోన్న నాగ్.. ఫైనల్ గా మళయాల హిట్ మూవీ పొరింజు మరియంజోస్ అనే సినిమాను తెలుగులో ”గలాటా” పేరుతో రీమేక్ చేస్తున్నాడు.ఈ రీమేక్ కోసం కొరియోగ్రాఫర్ స్టూవర్ట్ బిన్నిని దర్శకుడుగా ఎంచుకున్నాడు. అతనికి దర్శకుడుగా ఇదే ఫస్ట్ మూవీ.
ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను కూడా విడుదల చేస్తారట. ఆ గ్లింప్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని టాక్. మరి అంత ఎఫెక్టివ్ గా ఉంటుందంటే.. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయినట్టే కదా.. యస్.. వీళ్లు కామ్ గా వర్క్ స్టార్ట్ చేశారు. కాకపోతే బర్త్ డే రోజు అనౌన్స్ చేస్తారు. ఇక ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలోనే విడుదల చేయబోతున్నట్టు టాక్. ఈ డేట్ కూడా నాగ్ బర్త్ డే రోజునే ప్రకటిస్తారట. ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నాయి. ఆ లిస్ట్ లోకి నాగ్ కూడా వస్తున్నాడు.
సంక్రాంతికి మహేష్- త్రివిక్రమ్ గుంటూరు కారం, రవితేజ ఈగిల్, విజయ్ దేవరకొండ – పరశురామ్ ల సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా హను మాన్ ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు నాగార్జున మూవీ కూడా తోడైంది. మరింత ఇంత పోటీలో వచ్చే కంటే ఇంకేదైనా బెటర్ డేట్ చూసుకుంటే బావుంటుంది కదా అనిపిస్తోంది కదూ.. కానీ కొన్ని డేట్స్ కు ఉండే క్రేజ్ వేరే. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే ఇలా అందరూ తొందరపడుతుంటారు.