అంబానీ పెళ్లి వేడుకలో రామ్ చరణ్ కు అవమానం?

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్ అన్న రీతిలో జరిగాయి. గుజరాత్, జామ్ నగర్ లో జరిగిన ఈ వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ వేడుకలో మెరిశారు.

బాలీవుడ్ ఖాన్ త్రయం ఈ వేడుకల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘నాచో నాచో’ గీతానికి స్టెప్పులేయడం.. మధ్యలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను వేదికపైకి పిలిచి.. తమతో కలిపి స్టెప్పులేయమనడం.. ఆ వీడియోస్ ఎంతలా వైరల్ అయ్యాయో చూస్తూనే ఉన్నాము. అయితే.. అక్కడే మన మెగాపవర్ స్టార్ కి అవమానం జరిగిందట. చెర్రీనీ స్టేజ్ మీదకు పిలుస్తూ.. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్లు చేశారనేది ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ ఆరోపణలు.

షారుక్ ఖాన్.. ఇడ్లీ, వడ అని సంబోధిస్తూ రామ్ చరణ్ ను వేధికపై ఆహ్వానించడం తనకు అస్సలు నచ్చలేదంటూ జెబా హాసన్ సోషల్ మీడియాలో వివరిస్తూ పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో సౌత్ హీరోలు ఎవరైనా.. బాలీవుడ్ హీరోలను వడా పావ్, భేల్ పూరీ అని పిలిస్తే మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం జెబా హాసన్ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది

Related Posts