వరుణ్ కోసం సెక్సీ బ్యూటీ

డిఫరెంట్ స్టోరీస్ తో జర్నీ చేస్తున్నాడు వరుణ్ తేజ్. అందుకే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ వచ్చింది. మెగా హీరోలకు భిన్నమైన రూట్లో ప్రయాణం చేస్తున్నాడతను.అతను నటించిన కొత్త సినిమా గాండీవధారి అర్జున ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు.

రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ఇంప్రెస్ చేసింది మూవీ టీమ్. స్టైలిష్ స్పై థ్రిల్లర్ లా కనిపిస్తోందీ సినిమా. దీని తర్వాత అనూహ్యంగా వరుసగా రెండు ఫ్లాపులు చూసిన కరుణకుమార్ కు అవకాశం ఇచ్చాడు వరుణ్ తేజ్. పలాస సినిమాతో ఆకట్టుకున్నా.. ఆ తర్వాత శ్రీదేవి సోడా సెండర్, కళాపురం అనే సినిమాలతో ఫ్లాపులు చూశాడు కరుణ కుమార్. అయినా అతను చెప్పిన ఓ పీరియాడిక్ డ్రామాకు కనెక్ట్ అయ్యాడు వరుణ్ తేజ్. అందుకే ఈ మూవీ రేపు(శుక్రవారం) ప్రారంభం కాబోతోంది.


ఈ సినిమా 1960ల నేపథ్యంలో సాగుతుందట. మరీ అంత దూరం అంటే ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారో కానీ.. ఈ మూవీకి సంబంధించి ఒక్కో అంశం రివీల్ చేస్తున్నారు. వరుణ్ సరసన హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని అనౌన్స్ చేశారు. మీనాక్షి ఇప్పుడు స్వింగ్ లోనే ఉంది. ఇకలేటెస్ట్ గా మరో బ్యూటీని కూడా తీసుకున్నారు.ఇప్పటి వరకూ తెలుగులో స్పెషల్ సాంగ్స్ కే పరిమితం అయిన నోరా ఫతేహిని ఈ సినిమాలో మరో కథానాయికగా తీసుకున్నారు.

తను టెంపర్, కిక్2, షేర్, లోఫర్, ఊపిరి వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. అఫ్ కోర్స్ తను ఆ పాటలతోనే ఎక్కువగా ఫేమ్ అయింది. అలాంటి బ్యూటీని హీరోయిన్ గా తీసుకోవడం అంటే కాస్త వెయిట్ పెరిగినట్టే అనుకోవాలి. గ్లామర్ విషయంలో అస్సలు ఏ హద్దులూ లేకుండా దూసుకుపోవడం నోరా స్పెషాలిటీ. మరి తనను అలాంటి పాత్రకే పరిమితం చేస్తారా లేక ఏదైనా స్పెషల్ రోల్ ఉంటుందా అనేది చూడాలి. మొత్తంగా వరుణ్ సినిమాకు ఒక్కో అప్డేట్ తో వెయిట్ పెంచుకుంటూ వెళుతున్నారనే చెప్పాలి.

Related Posts