వరుణ్ తేజ్ ‘మట్కా’

వరుణ్ తేజ్, కరుణకుమార్ కాంబినేషన్ లో రూపొందబోతోన్న చిత్రానికి ”మట్కా” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓపెనింగ్ రోజే టైటిల్స్ చేశారు అంటే పక్కాగా రెడీ అయ్యారు అని అర్థం. సినిమా ప్రారంభించిన తర్వాత ఏ టైటిల్ పెట్టాలా అని ఆలోచించే రోజులివి.అలాంటిది మొదటే అనౌన్స్ చేయడం దర్శకుడి కాన్ఫిడెన్స్ తో పాటు హీరో అతన్ని ఎంత నమ్మాడు అనేది తెలియజేస్తోంది.

ఊహించినట్టుగానే ఇది పీరియాడిక్ స్టోరీ. కాకపోతే 1960ల కాలంలో అనుకున్నారు. బట్ 1975 అని పోస్టర్ లో ఉన్న రూపాయి కాయిన్ చూస్తే అర్థం అవుతుంది. మట్కా అనేది ఓ జూదం లాంటిది. ప్రభుత్వాలు దీన్ని నిషేధించాయి. అయినా ఆ ఆట నేపథ్యంలో ఎన్నో ముఠాలు సాగించిన వ్యాపారాలు ఆ కాలంలో అనేకం ఉన్నాయి. ఓ రకంగా ఇదో తరహా మాఫియా వ్యవహారం.

అలాంటి మాఫియా నేపథ్యంలోనే వరుణ్ తేజ్ తో కరుణ కుమార్ సినిమా చేస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే ఆ కాలం నాటి రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి. వింటేజ్ కార్ తో పాటు వెనక 1930లో స్థాపించిన ఇల్లు ఉంది. దానిపై పూర్ణ అనే పేరుంది. ఇక వైజాగ్ నేపథ్యం అన్నట్టుగా సముద్రంలోని లైట్ హౌస్ ఉంది.


ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న సినిమా ఇది. జివి ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహిలను ఫైనల్ చేశారు. మొత్తంగా ఈ మూవీతో వరుణ్ తేజ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు అని అర్థం అవుతోంది.

Related Posts