ప్రతి దర్శకుడికీ ఓ టేస్ట్ ఉంటుంది. దానికి అనుగుణంగా ఆలోచిస్తాడు. కథలు రాసుకుంటాడు.తెలుగులో నిన్నుకోరి చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన శివ నిర్వాణ కూడా ఆ కోవలోనే ఉంటాడు. తన కథలు లార్జర్ దన్ లైఫ్ ఉండవు. మనం చూసిన మనుషులు, మనకు తెలిసిన వ్యక్తిత్వాల కలయికగానే కథలు రాసుకుంటున్నాడు.
అందుకే నిన్నుకోరి వంటి సందేశాత్మక ప్రేమకథను చాలా మెచ్యూర్డ్ గా చెప్పాడు. అంటే జనం కూడా అలా ఆలోచించాలని అతను చెప్పిన సందేశం అది. అలాంటి మనుషులు సమాజంలో ఎందరో ఉన్నారు. వారికోసమే ఈ కథ అన్నట్టుగా ఉంటుందా చిత్రం.ఆ తర్వాత చేసిన మజిలీ సైతం కదిలించే కథే. ప్రేమించిన అమ్మాయి దూరమైతే జీవితమే పోయినట్టు కాదు. మనల్ని ప్రేమించేవారూ ఉంటారు. అది తెలుసుకుంటే ఆనందం. లేదంటే జీవితం బాధ్యతారాహిత్యం అవుతుందన్న సందేశాన్ని మంచి ప్రేమ కథలుగా మేళవించి చూపించాడు. ఈ రెండు సినిమాలూ మధ్య తరగతి మనుషుల మనస్తత్వాన్ని చూపిస్తాయి.విఫలమైన తొలిప్రేమల తాలూకూ భావోద్వేగాలను దాటాలని చెబుతాయి.దాటితేనే జీవితానికి అర్థం ఉంటుందన్న సంగతి చెబుతాడు.
మూడో సినిమా టక్ జగదీష్ సైతం కుటుంబం,బంధాలు, మనస్ఫర్థలు, స్వార్థాల కలయికగానే చెప్పాలనుకున్నాడు. కానీ ఈ కథ కమర్షియల్ గా మిస్ ఫైర్ అయినా..అలాంటి మనుషులు ప్రతి కుటుంబంలోనూ ఉంటారు అనేది నిజం. ఇక ఇప్పుడు ఖుషీ చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమాతో తను పాటల రచయితగా కూడా మారాడు. ఇప్పటి వరకూ వచ్చిన మూడు పాటలూ అతనే రాశాడు. అన్నీ ఆకట్టుకుంటున్నాయి.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తోన్న ఈ సినిమా వైబ్స్ చూస్తోంటే మరోసారి తనదైన సెన్సిబుల్ రైటింగ్ తో మరో మెచ్యూర్డ్ స్టోరీ చెప్పబోతున్నాడా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం యేడాదిగా ఎదురుచూస్తున్నాడు.ఆ ఎదురుచూపులకు ఫలితం ఖచ్చితంగా ఉంటుందని.. ఈ పాటలే చెబుతున్నాయి. ఈ సెప్టెంబర్ 1న ఖుషీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
మరి ఈ సినిమాతో ఎలాంటి అనుభూతిని ఇస్తాడో కానీ.. ఖచ్చితంగా ఇప్పుడున్న తెలుగు దర్శకుల్లో శివ నిర్వాణది భిన్నమైన శైలి. ఆ శైలి ఎక్కువగా వాస్తవిక పాత్రల చుట్టూ తిరగడం వల్లే అతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు. ఇదిలాగే కొనసాగిస్తూ.. మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుందాం.. ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారేమో.. ఇవాళ(బుధవారం) శివ నిర్వాణ బర్త్ డే. అందుకు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న ఈ…
డెబ్యూ మూవీ 'మ్యాడ్'తో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పుడు రెండో సినిమా 'ఆయ్'తో రెడీ…
ఈరోజు (మే 11) సుధీర్ బాబు బర్త్ డే స్పెషల్ గా 'హరోం హర' నుంచి కొత్త పాట వచ్చింది.…
Before 'Acharya', Koratala Siva was in the list of directors who did not succeed in…
‘ఆచార్య‘ ముందు వరకూ తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ఉండేవాడు కొరటాల శివ. అయితే.. మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య‘ కొరటాల…
The Bharat Ratna Award is India's highest civilian award. Bharat Ratna is awarded to those…