సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ

ప్రతి దర్శకుడికీ ఓ టేస్ట్ ఉంటుంది. దానికి అనుగుణంగా ఆలోచిస్తాడు. కథలు రాసుకుంటాడు.తెలుగులో నిన్నుకోరి చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన శివ నిర్వాణ కూడా ఆ కోవలోనే ఉంటాడు. తన కథలు లార్జర్ దన్ లైఫ్ ఉండవు. మనం చూసిన మనుషులు, మనకు తెలిసిన వ్యక్తిత్వాల కలయికగానే కథలు రాసుకుంటున్నాడు.

అందుకే నిన్నుకోరి వంటి సందేశాత్మక ప్రేమకథను చాలా మెచ్యూర్డ్ గా చెప్పాడు. అంటే జనం కూడా అలా ఆలోచించాలని అతను చెప్పిన సందేశం అది. అలాంటి మనుషులు సమాజంలో ఎందరో ఉన్నారు. వారికోసమే ఈ కథ అన్నట్టుగా ఉంటుందా చిత్రం.ఆ తర్వాత చేసిన మజిలీ సైతం కదిలించే కథే. ప్రేమించిన అమ్మాయి దూరమైతే జీవితమే పోయినట్టు కాదు. మనల్ని ప్రేమించేవారూ ఉంటారు. అది తెలుసుకుంటే ఆనందం. లేదంటే జీవితం బాధ్యతారాహిత్యం అవుతుందన్న సందేశాన్ని మంచి ప్రేమ కథలుగా మేళవించి చూపించాడు. ఈ రెండు సినిమాలూ మధ్య తరగతి మనుషుల మనస్తత్వాన్ని చూపిస్తాయి.విఫలమైన తొలిప్రేమల తాలూకూ భావోద్వేగాలను దాటాలని చెబుతాయి.దాటితేనే జీవితానికి అర్థం ఉంటుందన్న సంగతి చెబుతాడు.


మూడో సినిమా టక్ జగదీష్ సైతం కుటుంబం,బంధాలు, మనస్ఫర్థలు, స్వార్థాల కలయికగానే చెప్పాలనుకున్నాడు. కానీ ఈ కథ కమర్షియల్ గా మిస్ ఫైర్ అయినా..అలాంటి మనుషులు ప్రతి కుటుంబంలోనూ ఉంటారు అనేది నిజం. ఇక ఇప్పుడు ఖుషీ చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమాతో తను పాటల రచయితగా కూడా మారాడు. ఇప్పటి వరకూ వచ్చిన మూడు పాటలూ అతనే రాశాడు. అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తోన్న ఈ సినిమా వైబ్స్ చూస్తోంటే మరోసారి తనదైన సెన్సిబుల్ రైటింగ్ తో మరో మెచ్యూర్డ్ స్టోరీ చెప్పబోతున్నాడా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం యేడాదిగా ఎదురుచూస్తున్నాడు.ఆ ఎదురుచూపులకు ఫలితం ఖచ్చితంగా ఉంటుందని.. ఈ పాటలే చెబుతున్నాయి. ఈ సెప్టెంబర్ 1న ఖుషీ ప్రప