విశాల్ ‘రత్నం‘ నుంచి రెండో పాట..!

యాక్షన్ స్టార్ విశాల్ లేటెస్ట్ మూవీ ‘రత్నం‘. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. యాక్షన్ డైరెక్టర్ హరి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ‘రత్నం‘ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘చెబుతావా’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజయ్యింది. శ్రీమణి సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని సింధూరి విశాల్ ఆలపించారు. మెలోడియస్ గా సాగుతూనే ఎమోషనల్ గా ఈ గీతం ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 26న ‘రత్నం‘ తెలుగు, తమిళం భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts