‘దేవర‘కి బాలీవుడ్ లో ‘బాహుబలి‘ టచ్..!

రీజనల్ మూవీస్ కు బాలీవుడ్ లో రెడ్ కార్పెట్ పరిచిన మూవీ ‘బాహుబలి‘. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బాహుబలి‘ బాలీవుడ్ లో బడా హిట్ సాధించడంలో నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ పాత్ర ఎంతో ఉంది. కరణ్ జోహార్ కి చెందిన ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ.. ‘బాహుబలి‘ని భారీ స్థాయిలో ప్రమోట్ చేసింది. అలాగే.. అత్యంత ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేసింది. అందుకు తగ్గట్టే.. అత్యంత భారీ స్థాయిలో లాభాలను మూటగట్టుకుంది.

‘బాహుబలి‘ తర్వాత ఇప్పుడు ‘దేవర‘ చిత్రాన్ని బాలీవుడ్ లో విడుదల చేయడానికి రెడీ అవుతోంది ధర్మా ప్రొడక్షన్స్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవర‘ కూడా రెండు భాగాలుగా రాబోతుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న ‘దేవర‘ 1‘ విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా.. ‘దేవర‘ చిత్రాన్ని నార్త్ లో తాము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని తెలుపుతూ ధర్మా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

Related Posts