ఏప్రిల్ 19న ‘హ్యాపీడేస్‘ రీ-రిలీజ్

ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన కాలేజ్ మూవీ ‘హ్యాపీడేస్‘. 2007లో విడుదలైన ‘హ్యాపీడేస్‘ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాతో పరిచయమైన వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, వంశీ అందరూ హీరోలుగా చేశారు. అంతేకాదు.. క్యారెక్టర్ చేసిన కృష్ణుడు వంటి వారు కూడా ఆ తర్వాత హీరోగా నటించారు. తమన్నా, సోనియా దీప్తి, గాయత్రి రావు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది.

శేఖర్ కమ్ముల ఓన్ ప్రొడక్షన్ అమిగోస్ నుంచి ఇప్పుడు మరోసారి ఈ సినిమా రీ-రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా.. ‘హ్యాపీడేస్‘ మ్యాజిక్ ను మీ గ్యాంగ్ తో కలిసి థియేటర్లలో ఆస్వాదించండి అంటూ ఈ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్ షేర్ చేశాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

Related Posts