టాలీవుడ్

‘టిల్లు స్క్వేర్’ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్..

‘డీజే టిల్లు’ సినిమాతో యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొని టాలీవుడ్ లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నుంచి త్వరలో ‘టిల్లు స్క్వేర్’ రాబోతుంది. ఇందులో సిద్ధూకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘టిక్కెట్టే కొనకుండా’.. అనే సాంగ్ వచ్చి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘టిల్లు స్క్వేర్’ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చింది. ఈరోజు (25.11.23) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

అనుకున్నట్టుగా సాంగ్ ప్రోమోను రిలీజైంది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 9, 2024 న రిలీజ్ చేయబోతున్నట్టు ఇది వరకే వెల్లడించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, రామ్ మిరియాల సంగీతం సమకూర్చుతున్నారు.

Telugu 70mm

Recent Posts

‘కల్కి’ పార్ట్-2 అప్పుడే సగం పూర్తయ్యింది

'కల్కి' చిత్రానికి సీక్వెల్ గా 'కల్కి 2' రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సీక్వెల్ గురించి…

4 mins ago

Kollywood Superstar showered praises on ‘Kalki’

The movie 'Kalki' is getting tremendous response from the audience all over the world. Not…

48 mins ago

‘కల్కి’ని పొగడ్తలతో ముంచెత్తిన కోలీవుడ్ సూపర్‌స్టార్

'కల్కి' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ దక్కుతోంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం…

53 mins ago

Mirnaa

1 hour ago

‘kalki’ creating records in Overseas collections.

For Telugu movies, Andhra, ceded, Nizam and Karnataka were the main areas in the past.…

2 hours ago

Prabhas is the perfect actor for epic roles

There are no other epics in Hindu mythology than the epics Ramayana and Mahabharata. That's…

2 hours ago