‘టిల్లు స్క్వేర్’ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్..

‘డీజే టిల్లు’ సినిమాతో యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొని టాలీవుడ్ లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నుంచి త్వరలో ‘టిల్లు స్క్వేర్’ రాబోతుంది. ఇందులో సిద్ధూకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘టిక్కెట్టే కొనకుండా’.. అనే సాంగ్ వచ్చి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘టిల్లు స్క్వేర్’ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చింది. ఈరోజు (25.11.23) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

అనుకున్నట్టుగా సాంగ్ ప్రోమోను రిలీజైంది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 9, 2024 న రిలీజ్ చేయబోతున్నట్టు ఇది వరకే వెల్లడించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, రామ్ మిరియాల సంగీతం సమకూర్చుతున్నారు.

Related Posts