ఈ నగరానికి ఈ రేంజ్ క్రేజ్ ఏంటీ..

ఈ నగరానికి ఏమైంది.. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమా. విడుదలై ఐదేళ్లవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి, వెంకటేష్‌ కాకుమాను, సాయి సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2018 జూన్ 29న విడుదలైంది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే రోజు రీ రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని. అయితే ఈ మూవీ మొదట విడుదలైనప్పుడు పెద్దగా కలెక్షన్స్ రాలేదు.

కేవలం యూత్ కు మాత్రమే కనెక్ట్ అయింది. సినిమా అంతా తాగుతూనే ఉంటున్నారు ఏంది బై ఇది అనుకున్నారు. బి టెక్ అయిపోయిన కొన్నాళ్ల తర్వాత కలిసిన కొందరు స్నేహితులు.. వారి ఇష్టాలు, అభిరుచులు, అభిమతాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ సాగే చిత్రం ఇది. కాకపోతే ఆ క్రమంలో వెండితెరంతా మద్యం ఏరులై పారింది. అందుకే యూత్ కు కనెక్ట్ అయింది. ఇతర ఆడియన్స్ కు ఎక్కలేదు. అయితే తర్వాత వచ్చిన రీల్స్, షార్ట్స్ ట్రెండ్ లో ఈ మూవీకి సంబంధించి వస్తోన్న క్లిప్స్ చూసి చాలామంది అరే ఈ సీన్ బలే ఉందే.. అప్పుడు ఎందుకు మిస్ అయ్యామా అని ఫీలయ్యారు అనేది నిజం.

అందుకే ఇప్పుడు రీ రిలీజ్ అనగానే ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఎక్కువ థియేటర్స్ కావాలని అన్ని జిల్లా కేంద్రాలు, అర్బన్ ప్రాంతాల నుంచి డిమాండ్స్ వచ్చాయి. ఆ డిమాండ్స్ నిజమే అని ఇవాళ విడుదలై ఈ మూవీ తెచ్చుకున్న కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి.


తరుణ్‌ భాస్కర్ పెళ్లి చూపులు తర్వాత చేసిన సినిమా ఇది. అందుకే కొంత క్రేజ్ ఉండేది. కానీ ఓపెనింగ్స్ రాలేదు. ఇంకా చెబితే ఈ నగరానికి ఏమైంది మొదట విడుదలైనప్పుడు అంటే 2018 జూన్ 29న మార్నింగ్ షోకు వచ్చిన కలెక్షన్స్ 20 లక్షలు. కానీ ఈ గురువారం విడుదలైతే వచ్చిన కలెక్షన్స్ 80 లక్షలు. ఒక సినిమా రీ రిలీజ్ లో ఇంత పెద్ద ఫిగర్ అంటే చిన్న విషయం కాదు. ఈ విషయాన్ని మేకర్సే ప్రకటించారు. ఓరకంగా ఈ మూవీకి ఉన్న క్రేజ్ కు ఇది నిద