యాక్షన్‌ సీక్వెన్స్‌ షెడ్యూల్‌తో సరిపోదా శనివారం

దసరా మూవీతో రగ్గ్‌డ్ లుక్ తో కనిపించిన నేచురల్ స్టార్ నాని మరోసారి యాక్షన్‌ ప్యాక్డ్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరిపోదా శనివారం చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్‌తోనే మంచి బజ్‌ క్రియేట్ చేసింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.


శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్‌ మార్చి 18 నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Posts