‘ఆరంభం’ నుంచి ఫీల్‌ గుడ్ లవ్‌ సాంగ్ రిలీజ్‌

అజయ్‌ నాగ్ దర్శకత్వంలో మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో … అభిషేక్ వీటీ నిర్మిస్తున్న మూవీ ‘ఆరంభం‘. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్.
శ్రీకాంత్ అల్లపు లిరిక్స్ రాయగా .. సింజిత్ యెర్రమిల్లి సంగీతాన్ని అందించారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శివాని నాగరం ఈ పాటను పాడారు. లవ్ ఫీల్ తో బ్యూటిఫుల్ కంపోజిషన్ తో సాగుతుందీ పాట. ఈ పాటకు శివాని నాగరం వాయిస్ ప్రత్యేక ఆకర్షణ.
“ఆరంభం” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Related Posts